సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటుకు గడ్డుకాలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటుకు గడ్డుకాలం

కరీంనగర్, నవంబర్ 21, (way2newstv.com)
 జైపూర్‌ మండలంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. విద్యుత్‌ వెలుగులు విరజిమ్మాల్సిన థర్మల్‌ ప్రాజెక్టులో కాంతులు కరువయ్యాయి. సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటుకు గడ్డుకాలం ఎదురవుతోంది. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిపోవడంతో థర్మల్‌ పవర్‌కు రోజురోజుకూ డిమాండ్‌ పడిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడంతో జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నుంచి ట్రాన్స్‌కో ఉత్పత్తి నిలిపివేసింది. 20 రోజులుగా యూనిట్‌–2 (600మెగావాట్ల ప్లాంటు) షట్‌డౌన్‌కే పరిమితమైంది. యూనిట్‌–1 (600మెగా వాట్లప్లాంటు) కేవలం 80శాతం పీఎల్‌ఎఫ్‌ (ప్లాంటు లోడ్‌ ఫ్యాక్టరీ)తో నడుస్తోంది. ఒక్కరోజులో రెండు యూనిట్ల ద్వారా 27 మిలియన్‌ యూనిట్ల నుంచి 30 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసిన ఎస్టీపీపీ.. ఇప్పుడు కేవలం 11 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. 
సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటుకు గడ్డుకాలం

విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయడంతో రెండు యూనిట్ల ద్వారా ఒక్క రోజుకు కనీసం రూ.కోటిన్నరకుపైగా నష్టం వాటిల్లుతోంది.జైపూర్‌ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మించిన 1200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజె క్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ సరఫ రా చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో సింగరేణి థర్మల్‌ పవర్‌ప్లాంటు కీలకంగా మారింది. సీఎం కేసీఆర్‌ సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడంతో రెండు యూని ట్లు (12మెగా వాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంటు) ద్వారా మూడేళ్లల్లో నిరంతరం విద్యుత్‌ ఉత్పత్తి సాధించారు. సింగరేణి సంస్థ జర్మనీకి చెందిన స్టీగ్‌ఎనర్జీ అనే ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి వి ద్యుత్‌ ఉత్పత్తి నిర్వహణ బాధ్యతలు అప్పగించి న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవడం.. హైడల్‌ ప్రాజెక్టుల ద్వారా పవర్‌ ఉత్పత్తి కావడం.. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో సింగరేణి థర్మల్‌ పవర్‌కు డిమాండ్‌ తగ్గిపోతోంది. సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి అన్ని వనరులు ఉండి.. విద్యుత్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ డిమాండ్‌ లేనికారణంగా తెలంగాణ ట్రాన్స్‌కో ఎస్టీపీపీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కోరోజుకు 140 మిలియన్‌ యూనిట్ల నుంచి 160 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ను ట్రాన్స్‌కో డిమాండ్‌ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెన్‌కో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా 45 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయగా జెన్‌కో హైడల్‌(వాటర్‌ పవర్‌) ద్వారా 50 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. సెంట్రల్‌ థర్మల్‌ ప్లాంటుల ద్వారా 20 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయగా విండ్, సోలార్‌ ద్వారా మరో 20 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. జైపూర్‌ సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు ద్వారా కేవలం 11 మిలి యన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే చే స్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను బట్టి తెలంగాణ ట్రాన్స్‌పవర్‌ గ్రిడ్‌ ఆయా విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి సాధిస్తోంది.జైపూర్‌ సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటులో గల రెండు యూనిట్లు పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి సాధించడంతో రోజుకు 27 మిలియన్‌ యూ నిట్ల నుంచి 30మిలియన్‌ యూనిట్ల వరకు వి ద్యుత్‌ ఉత్పత్తి పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేయగా.. 20 రోజుల వ్యవధిలో యూనిట్‌–2 ప్లాంటు (అక్టోబర్‌ 23 నుంచి) పూర్తిగా షట్‌డౌన్‌ చేశారు. యూనిట్‌–1లో కూడా పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరపకుండా కేవలం 80శాతం పీఎల్‌ఎఫ్‌తో నడిపిస్తున్నారు. 27మిలియన్‌ యూని ట్లు సాధించిన ఎస్టీపీపీ ఇప్పుడు కేవలం 11మి లియన్‌ యూనిట్లకు విద్యుత్‌ ఉత్పత్తి పడిపోయింది. విద్యుత్‌ ఉత్పత్తి ప్రధానంగా నీరు, బొగ్గు, ఆయిల్‌ కాగా అన్ని వనరులు కలిగి ఉన్నప్పటికీ విద్యుత్‌ డిమాండ్‌ లేనికారణంగా ఉత్పత్తి నిలిపివేయడంతో రెండు యూనిట్ల ద్వారా ఒక్కరోజుకు రూ.కోటిన్నరకుపైగా నష్టం వాటిల్లుతోంది. ఇలా 20రోజుల వ్యవ«ధిలో రూ.28 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గతేడాది రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ఉండ డం.. ఎస్టీపీపీ ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి సాధించడం ద్వారా సింగరేణిలో సాధిం చిన లాభాల్లో అత్యధికంగా రూ.510 కోట్లు ఎస్టీపీపీ నుంచే వచ్చాయి. ప్రస్తుతం పవర్‌ డిమాండ్‌ పడిపోవడం ఈ ఏడాది అంతగా లాభాలు వచ్చేలా కనిపించడం లేదు.