డిసెంబరు 17న వృద్ధులు, దివ్యాంగులకు, 18న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డిసెంబరు 17న వృద్ధులు, దివ్యాంగులకు, 18న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమల డిసెంబర్ 16  (way2newstv.com)
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.ఇందులో భాగంగా  డిసెంబరు 17న మంగళవారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. 
డిసెంబరు 17న వృద్ధులు, దివ్యాంగులకు, 18న చంటిపిల్లల తల్లిదండ్రులకు
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

ఉదయం 10 గంటల స్లాట్కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.అదేవిధంగా, డిసెంబరు 18న బుధవారం 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.