డయల్ యువర్ కలెక్టర్ కు 18 వినతులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డయల్ యువర్ కలెక్టర్ కు 18 వినతులు

శ్రీకాకుళం, డిసెంబర్ 16  (way2newstv.com)
డయల్ యువర్ కలెక్టర్ కు  18 వినతులు అందాయి. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం కార్యక్రమాన్ని జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు నిర్వహించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
 శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం నుండి యన్.సత్యవతి మాట్లాడుతూ రాంబట్టీ, నారాయణపురం కాలువ ఆక్రమణలకు గురయ్యిందని, కావున దానిని తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు.
 పొందూరు మండలం కింతలి నుండి కె.శ్రీరామమూర్తి ఫోన్ చేసి మాట్లాడుతూ తమ గ్రామంలో వరి నకిలీ విత్తనాల వలన పంటలు దెబ్బతిన్నాయని, కావున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు.
డయల్ యువర్ కలెక్టర్ కు  18 వినతులు

 పాలకొండ నుండి కె.రామారావు మాట్లాడుతూ ఆగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించే రూ.10,000/-ల నగదు తన బ్యాంకు ఖాతాలో జమకాలేదని, కావున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 శ్రీకాకుళం నగరపరిధిలో గల గుజరాతీపేట నుండి కె.అరుణ ఫోన్ చేసి మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం క్రింద 300 చదరపు అడుగుల గృహం కొరకు దరఖాస్తుచేసుకోవడం జరిగిందని, రూ.500/-ల డిమాండ్ డ్రాఫ్ట్ ను కూడా సమర్పించామని, కావున తనకు గృహాన్ని మంజూరుచేయాలని కోరారు.
 బూర్జ మండలం నారాయణపురం నుండి యం.స్వామినాయుడు ఫోన్ చేసి మాట్లాడుతూ రైతుభరోసా నగదు ఇంతవరకు తన బ్యాంకు ఖాతానందు జమకాలేదని ఫిర్యాదు చేసారు.  
 హిరమండలం నుండి కె.సంజీవరావు మాట్లాడుతూ సర్వే నెం.71ను 22ఎ నుండి తొలగించాలని కోరారు.
 పొందూరు మండలం రాపాక నుండి బి.కృష్ణకుమార్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది వివరాలు తెలియజేయాలని కోరారు.
 హిరమండలం  నుండి ఎ.రమణమ్మ ఫోన్ చేస్తూ ఇంటి స్థలం పట్టాను మంజూరుచేయాలని కోరారు.
 నందిగాం మండలం సింగుపురం నుండి వై.కేశవరావు మాట్లాడుతూ వారి పంచాయతీలో యస్.సి రిజర్వేషనును అమలుచేయాలని కోరారు.
 జలుమూరు మండలం చల్లవానిపేట నుండి యు.ఢిల్లీరాజు మాట్లాడుతూ తాను దివ్యాంగుడనని, కావున తనకు దివ్యాంగుల పింఛనును మంజూరుచేయాలని కోరారు.
 మెళియాపుట్టి నుండి డి.శ్రీనివాసరావు ఫోన్ చేస్తూ తమ గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని, కావున వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి    డా. యం.చెంచయ్య, జిల్లా సరఫరాల అధికారి జి.నాగేశ్వరారావు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జిల్లా విద్యాశాఖాధికారి యం.చంద్రకళ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.