మెదక్ ఎంపీ సీటుకు మార్చబోతున్న కవిత? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెదక్ ఎంపీ సీటుకు మార్చబోతున్న కవిత?

నిజామాబాద్ డిసెంబర్ 16  (way2newstv.com)
 రాజకీయంగా సురక్షితమైన మెదక్ ఎంపీ సీటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత మార్చబోతున్నారని తెలుస్తోంది. కవిత అత్తింటి ఇల్లు నిజామాబాద్. అందుకే ఎంపీగా పోటీచేసేందుకు నిజామాబాద్ పార్లమెంట్ ను ఎన్నుకున్నారు. 2014లో అరంగేట్రంతోనే ఎంపీగా గెలిచారు. కానీ రెండో దఫా కుట్రలు కుతంత్రాలతో తన అత్తింట ఓడిపోయారు. అప్పటి నుంచి కవిత కోలుకోవడం లేదు. రైతులను రెచ్చగొట్టి పసుపు బోర్డు మద్దతు ధరను పైకి తెచ్చి బీజేపీ ఎంపీ అరవింద్ రెచ్చగొట్టడం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కవితకు వ్యతిరేకంగా పనిచేశారని టీఆర్ఎస్ అంచనాల్లో తేలిందట.. కవిత ఓటమి తర్వాత బయటకు కనిపించడం లేదు. కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. 
మెదక్ ఎంపీ సీటుకు మార్చబోతున్న కవిత?

కవిత ఓటమితో నిజామాబాద్ పార్లమెంట్ లో అభివృద్ధి పడకేసిందని.. ఇక్కడి ప్రజలు ఘోరమైన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. బీజేపీ ఎంపీని గెలిపించి అభివృద్ధిని దూరం చేసుకున్నారని ఆడిపోసుకున్నారు.అన్నట్టే నిజామాబాద్ ను అటు కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కవిత ఒక్కసారి కూడా అక్కడ అడుగు పెట్టడం లేదు. ఒక్క మంత్రి కూడా ఆ జిల్లాకు పోవడం లేదు. అభివృద్ధి పనులు సాగడం లేదట..తన కూతురు కవితను ఓడించిన నిజామాబాద్ ప్రజలపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారట.. అందుకే వచ్చే ఎన్నికల్లో  కవితను నిజామాబాద్ లో పోటీచేయించవద్దని నిర్ణయించినట్లు సమాచారం. మెదక్ ఎంపీగా కవితను మార్చాలని కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తన కూతురును ఓడించిన నిజామాబాద్ ప్రజలకు నేతలకు బుద్దివచ్చేలా దిమ్మదిరిగే నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.మెదక్ ఎంపీ సీటులో సిద్దిపేట గజ్వేల్ రెండూ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సిద్దిపేటలో తిరుగులేని హరీష్ రావు గజ్వేల్ లో కేసీఆర్ ఉన్నారు. ఈ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో బోలెడు మెజార్టీతో గెలుస్తారు. ఆ ఓట్లన్నీ మెదక్ ఎంపీకి పడుతాయి. గెలవడం ఖాయం. ఇదే జరిగితే నిజామాబాద్ మరింత నష్టపోవడం ఖాయమంటున్నారు. కవితను ఓడించినందుకు ఇప్పుడు నిజామాబాద్ వాసులకు కేసీఆర్ గట్టి దెబ్బ తీయబోతున్నారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.