50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

హైద్రాబాద్, డిసెంబర్ 20 (way2newstv.com)
తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన దిశ నిందితులు కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫేక్ ఎన్‌కౌంటర్‌లో తమ వాళ్లను చంపేశారని.. దీనికి పరిహారంగా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కస్టడీలో ఉన్నవారిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని.. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని వారు ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని కోరారు.దిశ మిస్సింగ్ కేసులో శంషాబాద్ పోలీసు స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో మరో ఎఫ్ఐఆర్ నమోదైందని.. ఒకే అపరాధంపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. దిశ కనిపించడం లేదని ఆమె సోదరి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. పోలీసులు వెంటనే స్పందించలేదని నిందితులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 
50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

తను ఎవరితోనూ వెళ్లిపోయి ఉంటుందని.. దానికి మా బాధ్యత లేదన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి చంపేయడంతో.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వచ్చాయన్నారు.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రిటర్డ్ జడ్డి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారని ఆరు నెలల్లోగా ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించారని కోర్టుకు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో హతులైన అరీఫ్ మైనార్టీ కాగా.. మిగతా ముగ్గురు నిందితులు ఎస్సీలని.. వీరంతా పేదలని న్యాయస్థానానికి తెలిపారు. వీరు ఎలాంటి నేరాలకు పాల్పడలేదన్నారు. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం, అసలైన నిందితులను కాపాడటం కోసం ఈ ఫేక్ ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు.ఎన్‌కౌంటర్లో చనిపోయిన వారిలో జొల్లు శివ, జొల్లు నవీన్ మైనర్లు.. పోలీసులు ఎలాంటి దయ లేకుండా వీరిని హతమార్చారని పిటిషన్లో పేర్కొన్నారు. దిశను ఈ నలుగురే రేప్ చేసి చంపేశారనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. ప్రజలను మెప్పించడం కోసం, కేసును మూసివేయడం కోసమే ఈ ఎన్‌కౌంటర్ చేశారన్నారు.ఈ ఎన్‌కౌంటర్ వెనుక తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు, మంత్రుల కుట్ర ఉందని ఆరోపించారు. నిందితులను శిక్షించే హక్కు పోలీసులకు లేదన్నారు. ఎన్‌కౌంటర్ ద్వారా పోలీసులు హీరోలయ్యారని.. మీడియా సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ బాడీ లాంగ్వేజ్‌ను గమనిస్తే.. ఎన్‌కౌంటర్ పట్ల ఎలా బాధా కనిపించలేదన్నారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సహా ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని నిందితుల కుటుంబీకులు న్యాయస్థానాన్ని కోరారు.చుట్టూ పది మంది పోలీసులు ఉండగా.. చీకటి వేళలో.. బక్కపల్చని నలుగురు వ్యక్తులు పోలీసు దగ్గర్నుంచి తుపాకీ లాక్కొని కాల్పులకు ప్రయత్నించారని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. కొందరు మంత్రులతో కలిసి పోలీసు ఉన్నతాధికారులు ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు.