గోదావరి చర్చకు తెరలేపిన రాపాక, రఘరామ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గోదావరి చర్చకు తెరలేపిన రాపాక, రఘరామ

ఏలూరు, డిసెంబర్ 20, (way2newstv.com)
రాజ‌కీయాల్లో మా రాజ‌కీయాలు వేర‌యా…అంటున్నారు రెండు పార్టీల‌కు చెందిన ఇద్దరు నాయ‌కులు. వారు గెలిచింది.. నిలిచింది.. ఒక పార్టీపైనా.. ఒక జెండాపై.. కానీ, ఇప్పుడు మాత్రం వారు చేస్తున్న రాజ‌కీయాలు పూర్తిగా ప‌క్క పార్టీలు, ప‌క్కజెండాలు.. ప‌క్కపార్టీల అజెండాల‌పై కామెంట్స్ ఇప్పుడు ఇదే చాలా చిత్రంగాను, విచిత్రంగాను అనిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న‌పై పార్టీ పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకుంది. ఆయ‌న గెలుపుతో పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని ఆశించింది.ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రాజుల డామినేష‌న్ ఎక్కువ‌గా ఉన్న ప‌శ్చిమ‌లో ఈయ‌న దూకుడు చూపిస్తార‌ని, ఫ‌లితంగా పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది.
గోదావరి చర్చకు తెరలేపిన రాపాక, రఘరామ

 అయితే, గెలిచిన త‌ర్వాత తొలి నెల లోనే ర‌ఘురామ కృష్ణంరాజు త‌న‌దైన శైలిలో రాజ‌కీయం చేశారు. వాస్తవానికి కీల‌క‌మైన పారిశ్రామిక వేత్తగా ఉన్న ర‌ఘురామ కృష్ణంరాజుకు కేంద్రంతో సంబంధ బాంధ‌వ్యాలు అవ‌స‌రం. ఈ క్రమంలోనే ఆయ‌న గెలిచిన రెండు నెల‌ల్లోనే రాజ‌కీయ రంగులు మార్చేస్తున్నారు. ఆయ‌న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ తెర‌చాటు మంత‌నాలు చేస్తున్నారు. ప్రధానంగా మోడీని ప్రస‌న్నం చేసుకునేందుకు త‌హ‌త‌హ లాడుతున్నారు. ఈ ప‌రిణామం పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. నిజానికి బీజేపీతో అంత‌ర్గ‌త మైత్రి ఉన్నప్ప‌టికీ.. వైసీపీ నేరుగా సంబంధాలు నెరుపుతున్న ర‌ఘుపై కోపంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఆయ‌న మాత్రం ఎక్కడా లెక్క చేయ‌డం లేదు. ఇదిలావుంటే, జ‌న‌సేన త‌ర‌పున రాజోలు నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్రసాద్‌.. కూడా త‌న‌ను గెలిపించిన పార్టీని, త‌న‌కు టికెట్ ఇచ్చిన పార్టీని ప‌క్కకు పెట్టి.. త‌నకు న‌చ్చిన రాజ‌కీయాలు చేస్తున్నారు.త‌న సొంత పార్టీ జ‌న‌సేన అధినేత ఏ పార్టీనైతే తిడుతున్నారో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెల్లారిలేస్తే.. ఎవ‌రిపైనైతే విరుచుకుప‌డుతున్నారో.. ఆ వైసీపీతోనే రాపాక వరప్రసాద్ స్నేహం చేస్తున్నారు. రాపాక జ‌న‌సేన నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీగా ఉన్నట్టు టాక్‌..? దీంతో ఈ ఇద్దరు నాయ‌కుల రాజ‌కీయాలు కూడా రాష్ట్రంలో ఆస‌క్తిగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్కడ కొస‌మెరుపేంటంటే.. ఈ ఇద్దరు నాయ‌కుల‌కు త‌మ త‌మ పార్టీల‌ను వ‌దిలి వెళ్లాల‌ని లేదు.. అలాగ‌ని పార్టీకి క‌ట్టుబ‌డాల‌ని కూడా లేదు… వాళ్ల అవ‌స‌రాల నేప‌థ్యంలో వాళ్లు సొంతంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. మొత్తానికి వీరి రాజ‌కీయం ఆశ్చర్యంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.