సీనియర్ నేతల మౌనం ఎందుకున్నది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీనియర్ నేతల మౌనం ఎందుకున్నది

గుంటూరు, డిసెంబర్ 23, (way2newstv.com)
రాజ‌కీయాల్లో అవ‌స‌రానికి నాయ‌కులు అందుబాటులోకి రావాలి. నాయ‌కులకు కూడా అవ‌స‌రానికి పార్టీలు అందుబాటులో ఉండాలి. ఇదే కీల‌క‌మైన సూత్రం. అయితే, గ‌తంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న స‌మయంలో టీడీపీని అన్నివిధాలా వాడుకున్న నాయ‌కులు ఇప్పుడు టీడీపీ ప్రతిప‌క్షంలో కి చేరిపోగానే.. ఒక్క సారిగా మౌనం వ‌హించారు. అస‌లు కొంద‌రి నేత‌ల‌ దృష్టిలో టీడీపీ మాది కాదు.. చంద్రబాబుదే. అనే ధోరణి కూడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ అధికారంలో ఉండ‌గా.. ప‌లువురు మీడియా ముందుకు వ‌చ్చి..చంద్రబాబు స‌హా పార్టీపై విప‌క్షాలు గుప్పించిన విమ‌ర్శలు తిప్పికొట్టేవారు.
సీనియర్ నేతల మౌనం ఎందుకున్నది

వీరిలో పెన‌మ‌లూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, విజ‌య‌వాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పొంగూరు నారాయ‌ణ, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు వంటి అనేక మంది గ‌తంలో టీడీపీ ఫైర్ బ్రాండ్లుగా ఉన్నారు. చంద్రబాబుపైనా పార్టీపైనా ఎలాంటి విమ‌ర్శ వ‌చ్చినా వెంట‌నే తిప్పికొట్టేవారు. అలాంటి నాయ‌కులు ఇప్పుడు మొత్తంగా సైలెంట్ అయిపోవ‌డం రాజ‌కీయంగా చ‌ర్చకు ప్రాధాన్యం పెంచింది. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హజం. నేడు అధికారంలో ఉన్న పార్టీ రేపు ఉంటుంద‌నే గ్యారెంటీ ఏమీలేదు.మ‌రి అలాంటి స‌మ‌యంలో పార్టీని కాపాడుకోవాల్సిన నాయ‌కులు ఇప్పుడు టీడీపీపైనా, పార్టీ అధినేత చంద్రబాబుపైనా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విమ‌ర్శల‌ను తిప్పికొట్టడంలోకానీ, విమ‌ర్శల‌కు ప్రతివిమ‌ర్శ లు చేయ‌డంలో కానీ ఎక్కడా దూకుడు ప్రద‌ర్శించ‌డం లేదు. ఏదో మొక్కుబ‌డిగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొంటున్నారే త‌ప్ప. వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయ‌డం లేదు. అంటే.. ఈ నేప‌థ్యం లో రెండు విష‌యాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒక‌టి టీడీపీ గ‌త పాల‌న‌లో త‌ప్పులు చేసింద‌ని, దీనిని ఎలా క‌వ‌ర్ చేస్తామ‌ని ఈ నేత‌లు భావిస్తున్నారా? లేక‌.. పార్టీ ఎలా పోతే మాకేంటి.. అనుకుంటున్నారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి దీనికి నాయ‌కులు ఎలాంటి ఆన్స‌ర్ ఇస్తారో చూడాలి.అదే టైంలో మ‌ళ్లీ అదే అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌద‌రి, ఓడిపోయిన దేవినేని ఉమా లాంటి వాళ్లే ప్రెస్‌మీట్లో పెడుతూనో లేదా అసెంబ్లీలోనే ప్రతిప‌క్షంలో ఉంటూ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తుండ‌డంతో పాటు బాబుకు కుడి, ఎడ‌మ భుజ‌ల్లా ఉంటున్నారు. మిగిలిన నేత‌లు మాత్రం త‌మ‌కెందుకులే ? అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు.