హైదరాబాద్. డిశంబర్ 06 (way2newstv.com)
భారత రాజ్యంగ నిర్మాత డా. బీఆర్ . అంబేడ్కర్ 63వ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలతో నివాళి అర్పించారు. ఈకార్యక్రమానికి శాసనసభ వ్యవహారాలు, ఆర్ అండ్ మీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కౌన్సిల్ చీఫ్ విప్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, తదితరులు హజరయ్యారు.
అంబేద్కర్ కు నివాళులు