ప్యాంట్ మర్చిపోయవంటూ ట్వీట్స్
హైద్రాబాద్, డిసెంబర్ 27 (way2newstv.com)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తరవాత స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ఏడాది నాగార్జున సరసన ‘మన్మథుడు 2’లో బోల్డ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి మకాం మార్చిన రకుల్.. అక్కడే పాగా వేయాలని చూస్తోంది. అందుకే, అందాల ఆరబోతకు అస్సలు వెనకాడటం లేదు.
బ్లాక్ షర్టులో రకుల్...
టాలీవుడ్‌లో ఉన్నప్పుడు ఇక్కడి ఫంక్షన్‌లకు ట్రెండీ డ్రెస్సుల్లో వచ్చిన రకుల్.. బాలీవుడ్‌లో మాత్రం డ్రెస్సుల సైజు బాగా తగ్గించేసింది. చిట్టిపొట్టి బట్టల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. రకుల్ తాజాగా వేసుకున్న ఒక డ్రెస్‌లో అయితే ప్యాంట్ లేదు.. ఓన్లీ షర్ట్. బ్లాక్ కలర్ షర్ట్ లాంటి డ్రెస్సులో మతిపోగొడుతోన్న రకుల్ ప్రీత్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని పుట్టినరోజు వేడుకలు బుధవారం రాత్రి ముంబైలోని ఆయన నివాసంలో జరిగాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు చాలా మంది పాల్గొన్నారు. వరుణ్ ధావన్, కార్తిక్ ఆర్యన్, నోరా ఫెతాహి, తుషార్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, నితేష్ తివారి, ప్రగ్యా కపూర్, యామి గౌతమ్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ఈ పార్టీలో పాల్గొంది. బెంజ్ కారులో నుంచి దిగుతూ ఫొటోలకు పోజులిచ్చింది. మోకాళ్ల పైకి ఉన్న పొట్టి బ్లాక్ షర్టులో హొయలు పోతూ పోజులిచ్చింది.