టీడీపీ దూకుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీ దూకుడు

అమరావతిపై జనాల్లోకి వెళ్లేందుకు నిర్ణయం
గుంటూరు, డిసెంబర్ 4,(way2newstv.com)
ద్రబాబు జగన్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ కలుపుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇటు పార్టీలో ఉన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు జిల్లాలను పర్యటిస్తున్న చంద్రబాబు మరోవైపు జగన్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకం చేసేందుకు సిద్దమవుతున్నారు. జగన్ ఆరు నెలల పాలనలో చంద్రబాబు ఒంటరిగానే ఉద్యమించారు. అయితే ఇది ఆశించిన మైలేజీ రాలేదు. ఇసుక మీద చంద్రబాబు ఎన్ని ఆందోళనలు చేసినా రాని పాపులారిటీ పవన్ కల్యాణ‌్ ఒక్క రోజు చేసిన లాంగ్ మార్చ్ కి వచ్చేసింది.ఇసుకతో పాటు ఇంగ్లీష్ మీడియంపైనా చంద్రబాబు ఒంటరిగానే ఉద్యమించారు. కానీ ఏవీ ఫలప్రదం పెద్దగా కాలేదు. 
టీడీపీ దూకుడు

ఇసుక సమస్య ఇప్పుడు లేదు. ఇంగ్లీష్ మీడియంపైనా ప్రజల నుంచి జగన్ కు వస్తున్న సానుకూలతతో వెనక్కు తగ్గాల్సి వస్తుంది చంద్రబాబు. తాజాగా రాజధాని విషయంలో కొంత ఆందోళన చేశారు. ఇక్కడ చంద్రబాబుపై చెప్పులు విసిరిన సంఘటనతో కొంత సానుభూతి లభించినట్లు చంద్రబాబు భావిస్తున్నారు.ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ గెలవలేదు. అలాగే ఒంటరిగా అధికార పార్టీపై పోరు కూడా పెద్దగా కలసి రావడం లేదు. ఇప్పుడు చంద్రబాబు వద్ద ఉన్న ఏకైక ఆయుధం రాజధాని మాత్రమే. రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నది చంద్రబాబు ఆరోపణ. తాను ప్రజారాజధానిని నిర్మించాలనుకుంటే వైసీపీ సర్కార్ దానిని చంపేసిందని చంద్రబాబు పదే పదే విమర్శిస్తున్నారు.డిసెంబరు 9వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆయన రాజధాని అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందుకే డిసెంబర్ 5వ తేదీన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అన్ని పార్టీలతో పాటు మేధావులు, నిపుణులను సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. అధికారంలో ఉండగా నాలుగేళ్ల పాటు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని గుర్తుకు రాని చంద్రబాబుకు ప్రతిపక్షంలోకి రాగానే గుర్తుకు వచ్చామని వామపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. మొత్తం మీద రాజధాని అంశంతో ఇటు బీజేపీతో పాటు అన్ని పక్షాలను చంద్రబాబు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో? చూడాలి మరి.