హైదరాబాద్ డిసెంబర్ 4 (way2newstv.com)
;దేశంలో నిత్యం ఎన్ని అత్యాచారాలు.. దారుణ ఉదంతాలు చోటు చేసుకున్నా.. కొన్ని ఉదంతాలు మాత్రం మీడియాలో పెద్ద ఎత్తున ఫోకస్ అవుతాయి. దేశ ప్రజలు సైతం విపరీతంగా స్పందింస్తుంటారు. తాజాగా దిశా ఉదంతం ఈ కోవకు వచ్చేదే. ఆ మధ్యన తెలంగాణలో ఒక మహిళను చేతులు నరికి.. అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం మీడియా లో పెద్దగా ఫోకస్ కాక పోవటం దీనికి నిదర్శనంగా చెప్పాలి.ఐతే తన రాష్ట్రంలో ఏం జరిగినా దానికి ఎప్పుడెలా స్పందించాలో కేసీఆర్ కు ఒక క్లారిటీ ఉంటుంది. దానికి తగ్గట్లే ఆయన తీరు ఉంటుంది. తాజాగా దిశ ఉదంతం దేశ వ్యాప్తంగా కుదిపేస్తూ.. అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రులు ఉరుకులు పరుగులు పెడుతూ హైదరాబాద్ కు వస్తుంటే..
కేసీఆర్ కు చుక్కలు చూపించిన నేషనల్ మీడియా
రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవన్ నుంచి బాధితురాలి ఇంటికి వెళ్లకపోవటం.. ఓదార్చకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఢిల్లీలో ఒక హై ప్రొఫైల్ పెళ్లికి (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ కుమారుడు) హాజరు కావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకల్ మీడియా కారణంగా పెద్ద ఇబ్బంది లేకున్నా.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ దగ్గర నేషనల్ మీడియా మాత్రం కేసీఆర్ కు చుక్కలు చూపించింది. ఆయన నోట మాట రాకుండా చేసేలా ప్రశ్నల్ని సంధించింది.దిశ కుటుంబాన్ని పరామర్శించని ముఖ్యమంత్రి పెద్దోళ్ల ఇంట జరిగే పెళ్లికి మాత్రం వెళతారా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. దీన్ని మరింత పెద్దది చేసే ఉదంతం తాజాగా ఎదురైంది. తెలంగాణ ముఖ్యమంత్రికి పెళ్లళ్లకు హాజరుకావటానికి టైం ఉంటుంది కానీ దిశ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదా? అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్.శబరిమల ఆలయంలో మహిళల్ని అనుమతించని వైనంపై పోరాడుతూ.. దేశ వ్యాప్తంగా తన వాదనకు కొందరి మద్దతు సంపాంచుకున్న ఫూణెకు చెందిన ఈ మహిళా నాయకురాలు ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చారు. అనూహ్యంగా సీఎం కేసీఆర్ నివాసం వద్దకు దూసుకొచ్చిన ఆమె.. ప్రగతిభవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రికత్త చోటు చేసుకుంది.ఆమె రాకతో మరోసారి జాతీయ మీడియా ప్రగతి భవన్ మీదా.. కేసీఆర్ పాలనా తీరు మీదా.. దిశ వ్యవహారంలో ఆయన వ్యవహరిస్తున్న వైఖరిని తప్పు పట్టే పరిస్థితి. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తృప్తి దేశాయ్ ఎంట్రీతో దిశ వ్యవహారంలో కేసీఆర్ కు మరో తలనొప్పి తప్పదంటున్నారు.ఒక్కోసారి అంతే. సమస్యలన్ని కలిసి కట్టుగా వచ్చి మీద పడిపోతాయంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది.