పౌరసత్వ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పౌరసత్వ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ డిసెంబర్ 4, (way2newstv.com)
కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈ బిల్లు ప్రవేశపెడతారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలోనే ఈ బిల్లుపై సంకేతాలిచ్చారు. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఉభయసభల్లో సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కూడా మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
పౌరసత్వ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఏ రకమైన పత్రాలు లేకపోయినా వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్లో 11 ఏళ్లు తప్పనిసరిగా నివసించి ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. దానిని ఇప్పుడు ఆరేళ్లకు తగ్గించినట్లు సమాచారం. బిల్లును ప్రధార ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఏఐఏడిఎంకే లాంటి పార్టీలలు మాత్రం మద్దతు ప్రకటించాయి.