నామినేటెడ్ పోస్టుల్లో యాభైశాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నామినేటెడ్ పోస్టుల్లో యాభైశాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకే

శాసనసభలో ముఖ్యమంత్రి
అమరావతి డిసెంబర్ 11, (way2newstv.com)
నామినేటెడ్ పోస్టుల్లో యాభైశాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగిలిన పదవులనూ భర్తీచేస్తాం. తుదిజాబితాను ఇదే శాసనసభలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ . ప్రశ్నోత్తరాల సమయంలో అయన  వివరణ ఇచ్చారు.నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లపై చంద్రబాబుగారి పార్టీ వక్రీకరణ చేస్తోంది. ఇంతగా వక్రీకరణ చేసే పార్టీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనం చేసిన ఏకైక సభ మనది. దేశ చరిత్రలోనే ఇలాంటి చట్టాన్ని మన సభ మాత్రమే చేసింది.  మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై చట్టం చేశామని అన్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో యాభైశాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకే

నామినేటెడ్ పనుల్లో కూడా 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన ఏకైక రాష్టం మన రాష్ట్రం మాత్రమే. ఇందులో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పించాం. రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న ఓసీలకు చెందిన వారైతేనే ఏఎంసీల పదవులు ఇచ్చే పరిస్థితి వుంది. అలాంటి మార్కెట్పోస్టుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం. కృష్ణాజిల్లాలో 19 మార్కెట్ కమిటీ పోస్టులు ఉంటే... అందులో 10 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులతోపాటు, దేవాలయాల ఛైర్మన్ల పదవుల్లోనూ రిజర్వేషన్లు పాటిస్తున్నామని అన్నారు. ఎంతో పలుకుబడి ఉంటే తప్ప దేవాలయ ఛైర్మన్ పదవి వచ్చేదికాదు. దేవాలయాల ఛైర్మన్లు, సభ్యులకు సంబంధించి పదవుల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తున్నాం. న్నటిమొన్న డీసీసీబీలు, డీసీఎంఎస్లకు సంబంధించి 13 ఉంటే.. అందులో 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. జస్టిస్ ఎ.శంకరనారాయణ, శాశ్వత బీసీ కమిషన్ ఛైర్ పర్సన్, జక్కంపూడి రాజా, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ఆర్కే రోజా, ఏపీఐఐసీకి ఛైర్మన్గా పెట్టాం. ప్రముఖ వైద్యుడు చంద్రశేఖరరెడ్డిని, ఏపీ మెడికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పెట్టాం. చంద్రబాబు అత్తగారు, నందమూరి లక్ష్మీపార్వతిగారికి తెలుగు అకాడమీ ఛైర్మన్ ఇచ్చాంలక్ష్మీపార్వతి కి వాళ్లు ఏమీ ఇవ్వలేదు. కాని, మేం ఇచ్చాం. రామ్మెహన్ రావుకి వైస్ఛైర్మన్గా ఇచ్చాం. లక్ష్మమ్మ  వైస్ఛైర్మన్ ఇచ్చాం. ఏపీఎస్హెచ్సీ సెక్రటరీగా బి.సుధీర్ ప్రేమ్కుమార్కు ఇచ్చాం. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ ని నియమించాం.భార్గవ రామ్మోహన్రావు  వైస్ఛైర్మన్గా నియమించాం. ఏపీ స్టేట్మినిమమ్ వేజెస్ బోర్డు ఛైర్పర్సన్గా రామ్మోహన్రావు ఉన్నారు. ఏపీ ఉర్దూ అకాడమీ ఛైర్మన్గా ఎం.డి.నౌమాన్ ఉన్నారు. అబ్దుల్ రహీం అఫ్సర్ వైస్ఛైర్మన్గా ఉన్నారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కార్పొరేషన్ కమిషన్ ఛైర్పర్సన్గా జియావుద్దీన్,  బండి అర్జున్ మనోజ్కుమార్ వైస్ఛైర్మన్గా ఉన్నారు. జేసీ శర్మను ఒన్మేన్ కమిషన్ ఛైర్మన్గా పెట్టాం. మధుసూదనరావును రెల్లికార్పొరేషన్ ఛైర్మన్గా పెట్టాం. ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్గా అమ్మాజీని పెట్టాం.ఏపీ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్గా కొమ్మూరి కనకారావును నియమించాం. మహిళా కమిషన్ ఛైర్మన్గా వాసిరెడ్డి పద్మను పెట్టాం. ఇలా చెప్పుకుంటే.. పోతే, ఈ జాబితాలో చూస్తే.. సగానికిపైగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే ఉన్నారని అర్థం అవుతుంది. అయినా ప్రతిపక్షానికి ఇది కనిపించదని అయన వ్యాఖ్యానించారు. ఇంకా 160కిపైగా ఛైర్పర్సన్ నామినేటెడ్ పోస్టులు పెండింగులో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక వాటన్నింటినీ కూడా భర్తీచేస్తాం. తుదిజాబితా వచ్చే సరికి 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఉంటారు. ఇదే చట్టసభలో ఆ జాబితా కూడా విడుదలచేస్తాం. సగం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇస్తాం.ఇక సలహాదారుల విషయానికొస్తే.. ఈ పదవులు నామినేటెడ్ పదువులు కావు.  ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని సలహాదారులుగా నియమిస్తారు. వాళ్లు ఆయారంగాలకు సంబంధించి తమ సలహాలు సూచనలుద్వారా విలువ, సామర్థ్యాన్ని పెంచగలుగుతారని భావించి  అలాంటివాళ్లను సలహాదారులుగా నియమిస్తారు. ఈ పోస్టులు కూడా ఏడాదికో, రెండేళ్లకో ఉంటాయి. చంద్రబాబు కుటుంబరావు అనే వ్యక్తిని ఎందుకు తీసుకున్నారు.  మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే తీసుకున్నారని ఇవాళ నేను అనొచ్చు.  కాని నేను అలా అనదలుచుకోలేదు.నేను ఇక్కడ కులాన్ని ప్రస్తావించదలుచుకోలేదు. ఆయారంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే ఎవరైనా సలహాదారులుగా తీసుకుంటారు. అందుకే నేను దాని జోలికి పోవడంలేదు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతాం. మా కేబినెట్లో సుమారు 60 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు.  5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. నలుగురు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరని ఎవరని అడిగితే.. దళిత మహిళ అని గర్వంగా చెప్పగలుగుతానని అన్నారు.పిల్లలకు చదువులు చెప్పించే విద్యాశాఖమంత్రి ఎవరని అడిగితే.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సురేష్ అని గర్వంగా చెప్పగలుగుతా. రాష్ట్రంలో రెవిన్యూ మంత్రి ఎవరు అని అంటే.. సుభాష్ చంద్రబోస్  అని గర్వంగా చెప్పగలుగుతా. ప్రతి అడుగులోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మాదేనని గర్వంగా చెప్పగలుగుతానని జగన్ అన్నారు.