జగనే గన్నేరు పప్పు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగనే గన్నేరు పప్పు

అమరావతి డిసెంబర్ 11, (way2newstv.com)
జగన్ తప్పుడు మాటలు, లెక్కలు అందరూ చూశారు కదా. తెలుగులో ఎన్ని తప్పులు పలికారో మనం చూశాం. మేథమెటిక్స్లో కూడా వీక్గా ఉన్నట్టున్నారు. ఇంగ్లీష్లో కూడా అనేక తప్పులు పలుకుతున్నారు. నన్ను పప్పు పప్పు అని పదిసార్లు అంటున్నారు. ఈ వీడియో చూస్తే జగనే గన్నేరు పప్పు అని తేలిపోయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎద్దేవా చేసారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పేటీఎం బ్యాచులూ మీ గన్నేరు పప్పుపై స్పందనేంటి? వైకాపా ప్రజాప్రతినిధులారా మీ నాయకుడే పప్పుగా నిలిచాడు. సభ్యుడిని కాకపోయినా శాసనసభలో నన్ను టార్గెట్ చేస్తున్నారు.సభలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా నా పేరు ప్రస్తావించారని అన్నారు.చంద్రబాబు తరువాత నన్ను ఎక్కువగా విమర్శించారు. 
జగనే గన్నేరు పప్పు

సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సభా సంప్రదాయాలకు విరుద్ధం. స్పీకర్ కూడా దీనిపై ఏమీ మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. నేను పై చదువులకు అమెరికా వెళ్లాను. వరల్డ్ బ్యాంక్లో రెండేళ్లు పనిచేశాను. స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాను. దాదాపు ఎనిమిదేళ్లు నేను అమెరికాలో ఉన్నాను. దీని వల్ల నేను తెలుగు మాట్లాడేటప్పుడు ఒక పదం అటూ ఇటూ వేసి ఉండొచ్చనా అన్నారు.దీన్నే పట్టుకుని తెలుగు మాట్లాడటమే రాదని అసత్య ప్రచారం చేశారు.నేను జయంతిని వర్థంతి అని పలకవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమైనా అన్యాయం జరిగిందా? దీనివల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయా? పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా? అమరావతి పనులు ఆగిపోయాయా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. 11 కేసుల్లో ఉన్న వ్యక్తి జగన్. 43 వేల కోట్లు జగన్ దోచుకున్నారని సీబీఐ ఈడీ చెప్పింది. ఈ కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్నారు జగన్. ఇటువంటి జగన్ ఈ రోజు నీతులు చెబుతున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రిగా ఏపీకి సేవ చేశా. ఇది నేను గర్వంగా ప్రకటించగలను. ఉపాధి హామీ నిధులు గరిష్టంగా ఏపీకి తీసుకొచ్చా. 25 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించాను. మరుగుదొడ్లు, శ్మశానాలకు ప్రహారీ గోడలు కట్టాం. ఎప్పుడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చేశాం. ఎల్ఈడీ వీధి దీపాలు వేశాం. 53 అవార్డులు సాధించాం. మంత్రిగా ఏపీ అభివృద్ధిలో భాగస్వామినయ్యానని అన్నారు. మరోవైపు టీడీపీ కార్యదర్శిగా క్రియాశీలకంగా పనిచేశాను. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటుకు ప్రతిపాదించాను. భారతదేశంలో ఏ పార్టీకి లేని విభాగాన్ని టీడీపీలో ఏర్పాటు చేశాం. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదబీమా కల్పించాం.4200 కుటుంబాలకు 84 కోట్ల రూపాయల ప్రమాదబీమా అందించాం. కార్యకర్తల విద్య, వైద్య అవసరాలకు సాయం అందజేశాం. చంద్రబాబు సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారని ఆరోపిస్తున్నారని అన్నారు. నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదు. నాన్న గెలిచిన చోటు నుంచే గెలిచి కాలర్ ఎగరేసే బ్యాచ్ కాదు నేను. టీడీపీ ఎక్కడ గెలవలేదో అక్కడ్నించి గెలవాలనేది నా లక్ష్యం. 1985 నుంచి టీడీపీ జెండా ఎగరని నియోజకవర్గం మంగళగిరి. ఈ చరిత్ర తిరగరాయాలనే ఇక్కడ్నించి పోటీ చేసి ఓడిపోయాను. ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. వారానికి ఓ సారి జగన్ కోర్టుకెళతారు. తన సెక్యూరిటీ వాళ్లను చూసి అరెస్ట్ చేయడానికొచ్చారేమోనని జగన్ భయపడతారు. బెయిల్ రద్దవుతుందేమోననే భయం. నేను పుట్టేసరికి మా తాతగారు ముఖ్యమంత్రి. నేను స్కూల్కెళ్లేసరికి మా నాన్నగారు ముఖ్యమంత్రి. ఏ రోజూ నాపై ఒక్క ఆరోపణ రాలేదు. క్రమశిక్షణతో నన్ను పెంచారు. ఒక పదం తప్పు మాట్లాడితే మా అమ్మ కొట్టేది. మీలాగ వీధిరౌడీల్లా పెరగలేదు.మీలాగే అసభ్యకరంగా మాట్లాడొచ్చు కానీ పద్దతి కాదని అన్నారు. మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఏమైంది?ఐటీ కంపెనీలకిచ్చిన భూముల్లో అవినీతి అన్నారు ఏమైంది? నేను తప్పు చేయలేదు కాబట్టే మీరు నిరూపించలేకపోయారని అన్నారు. హెరిటేజ్పైనా ఆరోపణలకు దిగుతున్నారు. 1992లో ప్రారంభమైన హెరిటేజ్ అంచెలంచెలుగా ఎదిగింది. అమ్మ, బ్రాహ్మణి అహర్నిశలు కష్టపడి కంపెనీని అభివృద్ధి చేశారు.హెరిటేజ్ ప్రెష్ అమ్మేశామని చంద్రబాబు చెప్పినా వినడంలేదని అన్నారు. ఫ్యూచర్ గ్రూపులో షేర్లున్నాయి కాబట్టి ఆ కంపెనీ మీదేనని మంత్రి బుగ్గన  అంటున్నారు. బుగ్గన గారు ఎన్నికల అఫిడవిట్లో వివిధ కంపెనీల షేర్లు తనకున్నట్టు పేర్కొన్నారు. అంటే ఆ కంపెనీలన్నీ బుగ్గన గారివేనా? ఆ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచితే బుగ్గన గారు బాధ్యత వహిస్తారా? జగన్ సాక్షి ప్రారంభించినప్పుడు 2 రూపాయలకు అమ్మేవారు. అన్ని పేపర్లూ 2 రూపాయలకు అమ్మాలంటూ ఉద్యమం చేశారు. ఇప్పుడు సాక్షి పేపరు 7 రూపాయలు చేశారు. జగన్  పాదయాత్రలో అన్ని పెంచుతూ పోతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పకుండా అన్నీ పెంచుకుంటూ పోతున్నారు. ఇసుక, ఉల్లి, సాక్షి పేపర్, ఆర్టీసీ టికెట్ల ధర పెంచారు. లిక్కర్ రేటు పెంచారు..విద్యుత్ చార్జీలు పెంచేస్తారు. ఆన్లైన్లో ఒక మంచి వస్తువు చూసి ఆర్డర్ ఇస్తాం.తీరా అది డెలివరీ వచ్చాక పాడైన వస్తువు వచ్చినట్టే ఉంది ఏపీ ప్రజల పరిస్థితని అయన అన్నారు.