తిరుమల డిసెంబర్ 6 (way2newstv.com)
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు భక్తుల సౌఖర్యార్ధం తిరుమాడ వీధుల్లో తాత్కాలిక షేడ్లలను ఏర్పాటు చేస్తాంమని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డయల్ ఈవో కార్యక్రమంలో మొత్తం 21 మంది భక్తులు తమ సలహాలు, సూచనలు అందించడం జరిగిందన్నారు.. ఈ నెల 10వ తేదీ నుంచి క్యాలండర్స్, డైరీలు విక్రయాలను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తాంమని, ఈ నెల 26వ తేదీ సూర్యగ్రహణం కారణంగా 25,26 తేదీల్లో శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు..
పదమూడు గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత
శ్రీవాణి ట్రస్ట్ ను భక్తులు చాలా మంచిగా ఆదరిస్తున్నారని, శ్రీవాణి ట్రస్టు ప్రారంభించినప్పటి నుండి శ్రీవారి హుండీ ఆదాయం ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటి వరకు 6,813 మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు.. నవంబర్ నెలలో 21.16 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.., లడ్డు విక్రయాలు 99.9 లక్షలు విక్రయించడం జరిగిందని, హుండి ద్వారా 93.7 కోట్లు ఆదాయం లభించగా.., 8.75 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారని ఆయన తెలిపారు.. గత 7 నెలలు కాలంలో టిటిడి ట్రస్ట్ లకు 213 కోట్లు రూపాయలను భక్తులు కానుకగా సమర్పించడం జరిగిందని, హుండి ద్వారా 777 కోట్లు రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు.. 7 నెలలు కాలంలో 803 కేజీల బంగారాన్ని.. 3852 కేజీల వెండిని కానుకగా భక్తులు సమర్పించారని ఆయన తెలిపారు.. తిరుమలలో 544 రోజులకు సరిపడినంత నీటి నిల్వలు వున్నాయన్నారు.. టిటిడిలో జూనియర్ అసిస్టెంట్ పై స్థాయి ఉద్యోగాలు డిసెంబర్ లోనే భర్తికి నోటిపికేషన్ విడుదల చేస్తాంమని, జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు నియామకంకు సంభంధించి చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని, నివేదిక వచ్చాకా భర్తీ ప్రకియ ప్రారంభిస్తాంమని అయన తెలిపారు.
Tags:
Andrapradeshnews