విశాఖపట్టణం, డిసెంబర్ 16, (way2newstv.com)
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాటలకు అర్థాలు వేరులే అంటున్నారు. గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారంటూ ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. కొద్దికాలం వైసీపీ అని ఇక తాజాగా బీజేపీ లో గంటా శ్రీనివాసరావు చేరతారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆ మధ్య ఆయన మీడియా ముందుకు వచ్చి తాను పార్టీని వీడేది లేదని చెప్పారు. తాను టీడీపీలోనే ఉన్నానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నన్ను కన్ ఫ్యూజ్ చేయవద్దంటూ మీడియాపైనే మండి పడ్డారు.అయితే శాసనసభ సమావేశాలు ప్రారంభమై వారం రోజుులవుతుంది. ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయినా గంటా శ్రీనివాసరావు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.
కన్ఫ్యూజషన్ లో గంటా ఉన్నారా... పెడుతున్నారా...
గంటా శ్రీనివాసరావు ఏపీలోనే ఉన్నప్పటికీ ఆయన సమావేశాలకు హాజరు కావడం లేదు. తాన మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న విద్యాశాఖపై అధికార పార్టీ విమర్శలు చేస్తున్నా గంటా శ్రీనివాసరావు ఖండించే ప్రయత్నం చేయడం లేదు.ఇంగ్లీష్ మీడియం చర్చ సందర్బంగా బ్రిటీష్ కౌన్సిల్ ద్వారా ఇంగ్లీష్ బోధనలో శిక్షణ ఇప్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందుకు నిదులు కూడా కేటాయించామని చంద్రబాబు తెలిపారు. అయితే దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు ఏం చేశారని పరోక్షంగా గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేతలు ప్రశ్నించారు. పదిహేడు కోట్ల రూపాయలు ఎవరు మింగేశారని, శిక్షణ ఇప్పించకుండానే నిధులు మింగేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.దీనికి కూడా గంటాశ్రీనివాసరావు స్పందించలేదు. తాను తెలుగుదేశం పార్టీ వీడలేదంటారు. శాసనసభకు రారు. పార్టీ కార్యక్రమాలు చేయరు. ప్రభుత్వంపైనా ముఖ్యంగా తన శాఖపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పరు. ఇలా గంటాశ్రీనివాసరావు ఢిఫరెంట్ స్టయిల్లో పార్టీతో పాటు మీడియాను కూడా కన్ ఫ్యూజన్ లోకి నెట్టేశారు. బీజేపీలోకి వెళ్లాలని అంతా సిద్ధం చేసుకున్న గంటా శ్రీనివాసరావు ఆగడానికి కారణాలేమై ఉంటాయన్న చర్చ జరుగుతోంది. చివరి నిమిషంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. మొత్తం మీద గంటా శ్రీనివాసరావు టోటల్ గా కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారు.