యదేఛ్చగా తరలిపోతున్న సింగరేణి సంపద - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యదేఛ్చగా తరలిపోతున్న సింగరేణి సంపద

కరీంనగర్, డిసెంబర్ 13 (way2newstv.com)
సింగరేణి సంపదను  కాంట్రాక్టర్లు దోచుకుంటున్నరు..తెలంగాణ వచ్చాక సింగరేణిలో కాంట్రాక్టు వ్యవస్థ మరింతగా పెరుగుతోంది. ఇన్నాళ్లు ఓపెన్కాస్టులకే పరిమితమైన కాంట్రాక్టర్లు సర్కారు విధానాల కారణంగా ఇప్పుడు అండర్ గ్రౌండ్గనుల్లోకి ప్రవేశిస్తున్నరు. 120 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణిలో మొదటిసారి భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని  కొండాపూర్ భూగర్భగనిలో కాంట్రాక్ట్ పద్ధతిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతోపాటు పలు భూగర్భ గనుల్లోనూ కాంట్రాక్ట్ పద్ధతిలో బొగ్గు ఉత్పత్తికి యాజమాన్యం టెండర్లు పిలిచింది. కొన్ని ఖరారు కాగా మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. క్రమంగా ఇది ప్రైవేటీకరణ వైపు దారి తీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యదేఛ్చగా తరలిపోతున్న సింగరేణి సంపద

సింగరేణిలో పూర్తి స్థాయి కాంట్రాక్టు పద్ధతి దిశగా యాజమాన్యం పరుగులు పెడుతోంది.  ఇప్పటికే 19 ఓపెన్కాస్ట్ గనులకుగాను 13 గనుల్లో ఓవర్బర్డెన్ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు.  కొన్ని ఓపెన్కాస్ట్ గనుల్లో 30 సెం.మీ. మందం నుంచి 90 సెం.మీ. మందం వరకు కోల్ సీమ్ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేసే పనులను కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు. సింగరేణి వ్యాప్తంగా  దాదాపు  రూ.40వేల కోట్లకు పైగా విలువైన పనులు కాంట్రాక్ట్ పద్ధతిన సాగుతున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే చేపట్టగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలానికి  కాంట్రాక్టర్లతో యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఆర్జీ–3 ఓపెన్కాస్ట్ గనిలో దాదాపు 100కు పైగా గల వాహనాల ద్వారా కంపెనీ ఆధ్వర్యంలో అధికారులు ఓబీ పనులు చేపడుతున్నారు. ఇక్కడ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు చేసేలా టెండర్లను యాజమాన్యం పిలిచింది. ఆర్జీ ఓసీ–3లో ఇప్పటి వరకు సింగరేణి ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. ఇక్కడా పనులన్నింటిని కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. మణుగూరు ఓసీ–2లో సింగరేణికి షవల్స్, 15 క్యూబిక్ మీటర్ల దాకా మట్టి, బొగ్గును వెలికితీసే డంపర్లు ఉన్నాయి. కానీ ఈ గనిలోనూ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది.  అంటే రాబోయే కొద్ది రోజుల్లో ఇక ఏ ఒక్క ఓపెన్కాస్టు గనిలోనూ సింగరేణి సొంతంగా ఓబీ వెలికితీత పనులు చేపట్టే అవకాశం లేదు.అండర్గ్రౌండ్ గనుల్లో ఇన్నాళ్లూ కేవలం బొగ్గుపై సున్నం చల్లే పనులను మాత్రమే కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. క్రమంగా ట్రాక్ లైన్లు వేయడం, గాలి గోడలకు కట్టే పలు పనులను దశలవారీగా కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. కానీ బొగ్గు వెలికితీత పనులను కాంట్రాక్టర్లకు అప్పగించిన చరిత్ర లేదు. కొన్నేళ్లుగా కంపెనీలో ఓపెన్కాస్టుల నుంచే బొగ్గు ఉత్పత్తి ప్రధానంగా సాగుతోంది. భూగర్భ గనుల ద్వారా అనుకున్నమేర బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను యాజమాన్యం సాధించలేకపోతోంది. కానీ భవిష్యత్లో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా యాజమాన్యం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే యాజమాన్యం కాంట్రాక్టుకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సింగరేణిలో తొలిసారిగా మణుగూరులోని కొండాపూర్ అండర్గ్రౌండ్ మైన్లో  కాంట్రాక్టు పనులకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ గనిలో రెండు కంటిన్యూస్ మైనర్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు కాంట్రాక్టర్లతో యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. మొదటి దశలో భాగంగా ఒక కంటిన్యూయస్ మైనర్ను గనిలోకి తీసుకువచ్చారు. రెండో మిషన్ను కూడా త్వరలో తీసుకురానున్నారు. వచ్చే నెలలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుంది.సింగరేణిలో 28 భూగర్భ గనులున్నాయి. క్రమంగా అన్ని అండర్గ్రౌండ్ మైన్స్లలో బొగ్గు వెలికితీసే పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు యాజమాన్యం ముందుకెళ్తోంది. జీడీకే–11లో కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు కంటిన్యూయస్ మైనర్లతో బొగ్గు వెలికితీసే పనులు  టెండర్ల దశలో ఉన్నాయి. ఇందారం 1ఏ వకీల్పల్లి గనిలో, భూపాలపల్లి ఏరియాలోని కేటీకే లాంగ్వాల్ పనులు టెండ్లర్ల దశలో ఉన్నాయి.  కొత్తగూడెంలోని పీవీకే–5 అండర్గ్రౌండ్ మైన్లో మరో కంటిన్యూయస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసేలా కాంట్రాక్టర్తో ఒప్పందం జరిగింది. శాంతి ఖనిలో బోల్టర్ మైనర్ ద్వారా  ఈ  నెల నుంచే కాంట్రాక్ట్ పద్ధతిలో బొగ్గు ఉత్పత్తిని యాజమాన్యం చేపట్టబోతోంది. అడ్రియాల లాంగ్వాల్లో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ పనులను ఇప్పటివరకు కంపెనీయే చేపడుతూ వచ్చింది. కాగా ఈ పనులను సైతం కాంట్రాక్టర్లకు  అప్పగించేందుకు అగ్రిమెంట్ చేసుకునేందుకు సిద్ధమైంది.  కాసీపేట అండర్ గ్రౌండ్ మైన్లో ఎస్డీఎల్ మిషన్లతో పాటు వారి కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేసే పనులను కాంట్రాక్ట్కు ఇచ్చేలా ఇటీవల జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గనిలో జనవరిలోగానీ ఫిబ్రవరిలోగానీ  కాంట్రాక్ట్ పద్ధతిన బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంది. మొత్తంగా రూ. కోట్లు ఖర్చుచేసి కొంటున్న కంటిన్యూయస్ మైనర్లాంటి యంత్రాలను మన కార్మికులు 13 నుంచి 15 గంటలు కూడా నడపలేకపోతున్నారని,  కాంట్రాక్టర్లు 18 నుంచి 22 గంటల  వరకు నడుపుతున్నారని, అందుకే కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నామని సింగరేని హయ్యర్ అఫీషియల్స్చెబుతున్నారు. వీరి వాదన ఎలా ఉన్నా సింగరేణిలో పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుండడంపై కార్మికసంఘాల నేతలు మండిపడుతున్నారు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు సింగరేణిని దోచుకుంటున్నారని కేసీఆర్ఆరోపించారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టర్లే ఉండరని చెప్పారు. కానీ టీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  కంపెనీలో గతంలో ఎన్నడూ లేనంతగా కాంట్రాక్టు పనుల వాటా పెరిగింది. అండర్గ్రౌండ్ మైన్లలోనూ బొగ్గు తీసే పనులను కాంట్రాక్టర్లకే అప్పగిస్తున్నారు. ఓపెన్కాస్టులలో గతంలో మట్టి తీసే పనులనే ఇచ్చే వారు. ఇప్పుడు బొగ్గు తీసే పనులు కూడా ఇస్తున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపెన్కాస్టులు పెరిగాయి. అండర్గ్రౌండ్ మైన్లు తగ్గాయి. వర్క్షాప్లలో ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్ మజ్దూర్ల పనులు ప్రైవేట్ వారికి అప్పగించారు. అండర్గ్రౌండ్ మైన్లలో రూఫ్బోల్టింగ్, కంటిన్యూయస్ మైనర్, మేషన్ పనులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరులో ఆంధ్ర కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా పోరాడిన టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఇప్పుడు వాళ్లకే పనులను అప్పగిస్తుంటే ఏం మాట్లాడడం లేదు.