న్యూ ఢిల్లీ డిసెంబర్ 12 (way2newstv.com)
దేశంలో విద్యుత్తు సంక్షోభం లేదని కేంద్ర విద్యుత్‌శాఖ సహాయమంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ఇవాళ లోక్‌సభలో ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దేశవ్యాప్తంగా 365 గిగావాట్ల పవర్ జనరేషన్ జరుగుతోందన్నారు. డిమాండ్ కన్నా రెండు రేట్లు ఎక్కువగా విద్యుత్తు ఉత్పాదన జరుగుతోందని ఆయన తెలిపారు.
దేశంలో విద్యుత్తు సంక్షోభం లేదు: మంత్రి ఆర్కే సింగ్
ఈ ఏడాది అత్యధికంగా 183 గిగావాట్ల విద్యుత్తును వాడామని, కానీ దేశంలో 365 గిగావాట్లు ఉత్పత్తి చేసే జనరేటర్లు ఇన్‌స్టాల్ చేసి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆయా రాష్ట్రాలు తమ అవసరానికి తగినట్లుగా కేంద్ర సంస్థల వద్ద విద్యుత్తును కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం బోలడంత విద్యుత్తు అందుబాటులో ఉన్నదని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎంత కావాలంటే అంత విద్యుత్తును కొనుగోలు చేయవచ్చన్నారు.