ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా మేడారం జాతర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా మేడారం జాతర

వరంగల్, డిసెంబర్ 16, (way2newstv.com)
ఆసియా ఖండంలోనే అదిపెద్ద గిరిజన జాతర అయి న మేడారం జాతరను ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా చేపట్టేందుకు జిల్లా స్థాయి అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు అధికారులు భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. 2020 ఫిబ్రవరి 5,6,7,8 తేదీలలో జరిగే మేడా రం జాతరను పర్యావరణానికి హాని కలుగకుండా, ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. జాతరకు హాజరయ్యే భక్తులు బట్ట సం చులను వెంట తెచ్చుకొని ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఆయన అన్నారు. ప్లాస్టిక్ బ్యా గులకు బదులు ప్రతి ఒక్కరూ జూట్, బట్ట, పేపర్ బ్యాగులను వాడాలని అన్నారు. 
ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా మేడారం జాతర

హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, మటన్, చికెన్, కి రాణ, అన్ని వాణిజ్య సముదాయాలతోపా టు ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ప్లాస్టిక్ కనిపించకుండా చర్యలు చేపట్టాలని అన్నా రు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను ఖ చ్చితంగా వాడాలని తెలిపారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ సేకరణకు 40కేంద్రాలను గుర్తించి స్క్రాప్ సేకరణదారులకు ప్లాస్టిక్‌ను అప్పగించనున్నట్లు తెలిపారు. జాతర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను ఎప్పటికప్పుడు సేకరించి ఒక ప్లాస్టిక్ ముక్క కూడా మేడారం భూమిలో మిగిలి పర్యావరణానికి నష్టం క లుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశం నలుమూలల నుంచి జాతరకు హాజరయ్యే భక్తులు ప్లాస్టిక్‌ను వెంట తేకుండా జూట్, బట్ట కాగి తం, సంచులను వెంట తెచ్చుకోవాలని అన్నారు.ప్లాస్టిక్ విస్తరి ఆకులను కూడా వా డకుండా ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతరకు స హకరించాలని అన్నారు. ప్రపంచ ప్రఖ్యా త మేడారం జాతర వనదేవత జాతర అ ని, ఈ జాతరలో ప్లా స్టిక్ వాడకంతో ప ర్యావరణానికి, వన్యప్రాణులకు నష్టం వా టిల్లకుండా పర్యావరణ హితమైన జాతర జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టిక్ నిషేధ ఉల్లంఘటనకు పాల్పడితే రూ.5వే లకు తగ్గకుండా జరిమానాలను విధించనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు