పంటి బిగువున భరిస్తున్న చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పంటి బిగువున భరిస్తున్న చంద్రబాబు

విజయవాడ, డిసెంబర్ 13, (way2newstv.com)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఎగతాళి చేస్తున్నా… వెటకారం చేస్తున్నా ఆయన పంటి బిగువున భరిస్తున్నారు. చంద్రబాబు అప్పుడప్పుడు బరస్ట్ అవుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీకి చంద్రబాబు మాత్రమే టార్గెట్ అయ్యారు. చంద్రబాబు లేచి మాట్లాడుతుంటే చాలు వైసీపీ నేతలు పదే పదే అడ్డుపడుతున్నారు. నలభై ఏళ్ల అనుభవం అని, వయసు మించి పోయిందని, చాదస్తం పెరిగిందని ఇలా నానా మాటలు అంటున్నా చంద్రబాబు మౌనంగానే సహిస్తూ వస్తున్నారు.నిజానికి చంద్రబాబునాయుడుపై వైసీపీ ఉసి గొల్పుతుంది ఆయన రాజకీయ బిక్ష పెట్టిన నేతలనే కావడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు మొదలుపెడుతుండటంతోనే రాద్ధాంతం మొదలవుతోంది. 
పంటి బిగువున భరిస్తున్న  చంద్రబాబు

ఏ అంశం తీసుకున్నా ఆయన తొలుత విమర్శించకుండా సలహాలు, సూచనలతో ప్రారంభిస్తే వైసీపీ నేతలు అడ్డుతగిలే అవకాశం ఉండదు. అయితే ఆయన అసెంబ్లీలో ప్రసంగం మొదలు పెట్టగానే జగన్ ను తిట్లదండకంతో స్టార్ట్ చేస్తుండటంతో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.చంద్రబాబును టార్గెట్ చేస్తున్న వారిలో ఎక్కువగా ఆర్కే రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు. వీరంతా తెలుగుదేశం పార్టీలో అక్షరాలు దిద్ది రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఆర్కే రోజాకు చంద్రబాబు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా చేశారు. అయితే గత శాసనసభలో రోజా పట్ల టీడీపీ అనుసరించిన వైఖరితో ఇప్పుడు రోజా చంద్రబాబుపై పగతీర్చుకుంటున్నారు. మరోవైపు కొడాలి నాని కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. చంద్రబాబుతో విభేదించి కొడాలి నాని జగన్ పార్టీలో చేరారు. వల్లభనేని వంశీ సయితం ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా ఎన్నికలకు ముందు వరకూ టీడీపీలో ఉన్నవారే.ఇలా గతంలో టీడీపీలో ఉన్న వారే నేడు చంద్రబాబుకు శత్రువులుగా మారారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అవహేళన చేస్తున్నారు. ఆరోగ్యం సహకరించడం లేదని చంద్రబాబుకు తక్షణ వైద్యం అవసరమని సెటైర్లు వేస్తున్నారు. అయితే అందరూ ఎగతాళి చేస్తున్నా చంద్రబాబు ఓపిక పడుతుంది ఒక్క సానుభూతి కోసమే. తనను తిడితే రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అందరూ రౌండప్ చేసినా రోషానికి పోకుండా మౌనంగానే ఉంటున్నారు. మరి చంద్రబాబుకు సానుభూతి లభిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.ః