అమరావతి డిసెంబర్ 2 (way2newstv.com)
ఆపదలో ఉన్న మహిళలు తక్షణ సహాయం కోసం తమను సంప్రదించాల్సిన నంబర్లను డీజీపీ కార్యాలయం మరోసారి ప్రకటించింది.
-100కు ఫోన్ చేస్తే కాల్ సెంటర్‌లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకొని, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వారి నుండి తక్షణమే సహాయం పొందవచ్చు.
మహిళల రక్షణకు టోల్ ఫ్రీ నంబర్లు
- 112కు ఫోన్ చేస్తే బాధితులు ఉన్న లొకేషన్‌తో పాటు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చిరునామా కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితులకు రక్షణ కల్పిస్తారు.
- 181కు ఫోన్ చేస్తే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కాల్ సెంటర్‌కు వెళ్తుంది. మహిళలు తమ సమస్యను చెబితే పోలీసులకు సమాచారం పంపి వెంటనే అప్రమత్తం చేస్తారు.
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మహిళల రక్షణ కోసం పోలీసులు ‘సైబర్–మహిళామిత్ర’ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. వాట్సాప్ నంబర్ 9121211100 అందుబాటులో ఉంచారు. ఈ నంబరుకు వాట్సాప్ చేస్తే, బాధితులు ఉన్న ప్రదేశానికి పోలీసులు వెంటనే చేరుకుంటారు. రక్షణ కల్పిస్తారు.