కలగానే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కలగానే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ

కర్నూలు, జనవరి 7, (way2newstv.com)
టమోటా ధర ఉంటే రైతులకు పండగే. మరి ధర లేక పోతే రోడ్డుపై పార బోయాలి, లేదా పశువులకు మేతగా పోవాల్సిందే. టమోటా రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రత్యామ్న్యాయం కనుచూపుమేరా కనిపించడం లేదు. ఈ ప్రాంత  టమోటా రైతుల కష్టాలు తీరాలంటే జ్యూస్ ఫ్యాక్టరీ రావాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు.బహిరంగ మార్కెట్లలో టమోటా ధర పడిపోయినప్పుడు. ఇక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పితే కనీస గిట్టుబాటు ధర లభిస్తుందని ఇక్కడి రైతులు ఆశ. .. మరి జ్యుస్ ఫ్యాక్టరీ వచ్చిందా... రైతుల కల నెరవేరిందా అంటే లేదంటూనారు.. ఇక్కడి ప్రజలు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లోని పత్తికొండ, తుగ్గలి,మద్దికేర మండలాలు ఆలూరు నియోజకవర్గం లోని దేవనకొండ, ఆస్పరి మండల కేంద్రాలలో ప్రధానంగా ఖరీఫ్ లో టమోటా పంట 25 వేల హెక్టార్లలో  సాగు చేస్తారు. కోతకొచ్చిన టమోటాను పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొస్తారు. 
కలగానే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి పంట దిగుబడి బాగా వచ్చి మార్కెట్లో ధర నిలకడగా ఉంటే రైతుకు పెట్టిన పెట్టుబడి చేతికి అందుతుంది. కొన్ని నెలల పాటు ధరలు నిలకడగా ఉన్నా, అనుకోకుండా ఒక్కసారిగా టమోటా ధర ఒకరూపాయి కిలో కూడా పడిపోయే పరిస్థితి జరుగుతుంది. అలా వచ్చినప్పుడు తమ టమోటాకు రవాణా ఖర్చులు కూడా రాక వ్యవసాయ మార్కెట్ లోని టమోటాలను పారబోసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇలా ప్రతి సంవత్సరం కొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుంది. ఎప్పుడు ఏ రేటు పలుకుతుందో ? తెలియని అయోమయ పరిస్థితిలో టమోటా రైతులు కాలం వెళ్లబుచ్చుతున్నాడు. ఒక ఎకరాల్లో టమోటా సాగు చేయడానికి రైతుకు పాతిక వేల రూపాయలు పెట్టుబడిగా  వెచ్చించాల్సి వస్తోంది. ఒక ఎకరాల్లో వారానికి మూడు సార్లు టమోటా కోత కోవలసి వస్తుంది. టమోటాను కోత కోసుకొని ఆటోల ద్వారా పత్తికొండ మార్కెట్ తీసుకు వస్తారు. మార్కెట్లో  వ్యాపారస్తులు రైతులు తీసుకొచ్చిన టమోటా లకు వేలం పాట నిర్వహిస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో ధర మార్కెట్లో పలుకుతోంది. రైతుకు నిలకడగా గిట్టుబాటు ధర పలికింది అంటే తాను టమోటా కు పెట్టిన పెట్టుబడి రైతుకు అందుతుంది. గిట్టుబాటు ధర లేకపోతే టమోటా రైతుకు నష్టాలను చవిచూడవలసి వస్తుంది.  పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి టమోటా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ప్రాంతాలకి దిగుమతి చేస్తారు.అయితే ప్రధానంగా తెలంగాణా ప్రాంతానికి ఎక్కువగా టమోటాలను ఎగుమతి  చేస్తారు. అయితే డిసెంబర్, జనవరి మాసంలో తెలంగాణ ప్రాంతంలో స్థానికంగా టమోటాలను పండిస్తారు. ఇప్పుడు ఇక్కడి టమోటా లకు అమాంతంగా ధర పడిపోతుంది. దీంతో మార్కెట్కు తెచ్చిన సరుకును రైతులు రోడ్డుపై పారబోసి పశువులకు మేతగా పోసి ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ స్థానికంగా ఉంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని రైతులు ఆశతో పాతిక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్ తీసుకువచ్చిన టమోటాను ఒకటి రెండు రోజులు నిలువ చేసుకోవడానికి మార్కెట్ యార్డ్ లో ఏసీ గోడను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏర్పాటు రైతులు డిమాండ్ చేస్తున్నారు... మరో వైపు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు మాకు ఓటేయండి ఇక్కడ టమోటా జూస్ ఫ్యాక్టరీ  నెలకొల్పుతామని హామీలు ఇస్తున్నారు తప్ప, ఏ ఒక్క రాజకీయ నాయకుడు టమోటా రైతుల జ్యూస్ ఫ్యాక్టరీ కళను నెరవేర్చడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీ పై పాతికేళ్లుగా రాజకీయ నాయకులు ఇస్తున్న  హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల ముందు హామీలు తప్ప రాజకీయ నాయకులు టమోటా జ్యూస్ పరిశ్రమపై ఇంత వరకు వారగా పెట్టింది ఏమీ లేదు. పైగా ఇప్పుడు ఇక్కడ టమోటా పండు జూస్ కు పనికిరాదంటూ కొత్త పల్లవి అందుకున్నారు రాజకీయ నాయకులు.