విజయవాడ, జనవరి 2, (way2newstv.com)
ప్రభుత్వాలు పరిపాలనకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరే, జీవోల రూపంలో విడుదల చేసి, పారదర్సాకంగా ఉండేలా పరిపాలన చెస్తూ ఉంటాయి. గత కొన్నేళ్ళుగా ఇదే పరిస్థితి. అయితే ఈ జీవోల్లో, కొన్ని కొన్ని రహస్య జీవోలు ఉంటాయి. ఇవి బహిరంగంగా ఉండకూడదు, ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు కాని, ఇతర అంశాల పరంగా కాని, ఇబ్బంది అనుకుంటే, అప్పుడు రహస్య జీవోలు ప్రజలు విడుదల చేస్తూ ఉంటాయి. అన్ని ప్రభుత్వాలు లాగే, గతంలో చంద్రబాబు హయంలో కూడా అప్పుడప్పుడు రహస్య జీవోలు విడుదల చేస్తూ ఉండే వారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉండే జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ అయిన వైసీపీ, ఆయన పేపర్, ఆయన ఛానల్ కూడా, ఈ కొద్ది పాటి రహస్య జీవోల పై కూడా, చంద్రబాబుని ప్రశ్నించే వారు.
ఏపీలో రహస్య జీవోల చర్చ
ఆ రహస్య జీవోల్లో అవినీతికి సంబంధించిన అనేక ఆరోపణలు ఉన్నాయి అంటూ విమర్శలు చేసారు వారు. నిజానికి అది ఎంత సున్నితమైన అంశం అయినా, ప్రజల ముందు ఉంచాలి.గతంలో చంద్రబాబు అప్పుడప్పుడు ఇలా రహస్య జీవోలు ఇచ్చినా, అది తప్పే. ఎందుకంటే, ప్రజలు పారదర్సకత కోరుకుంటారు. మనం ఏమైనా దాస్తున్నాం అంటే, ఏదో జరిగినట్టే అని ప్రజలు అనుకుంటారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఎక్కువగా రహస్య జీవో లు విడుదల చేస్తున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. పోర్ట్ లకు సంబంధించి ఒక రహస్య జీవో రావటంతో, బందర్ పోర్ట్ ని తెలంగాణాకు అప్పగిస్తూ, ప్రభుత్వం రహస్య జీవో ఇచ్చింది అంటూ, ప్రతిపక్షాలు ఆరోపించాయి. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మే 30 నుంచి, నిన్నటి దాకా, అంటే డిసెంబర్ 31 దాకా, ఈ ఏడు నెలల్లో, దాదాపుగా 174 రహస్య జీవోలు విడుదల అయ్యాయి. ఏడు నెలల్లోనే 174 రహస్య జీవోలు అంటే, పెద్ద మొత్తంలో విడుదల చేసినట్టే.అయితే, ఇప్పుడు ప్రభుత్వం నిన్న ఒక్క రోజే విడుదల చేసిన రహస్య జీవోలు, అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఒక్క రోజే దాదపుగా, 80 కాన్ఫిడెన్షియల్ జీవోలను జారీ చేసి, ప్రభుత్వం రికార్డు సృష్టించింది. నిన్న రాత్రి 10గంటల వరకూ 205 జీవోలు జారీ కాగా, అందులో రహస్య జీవోల సంఖ్య 80 ఉండటం గమనార్హం. పంచాయతీరాజ్ శాఖ 40 జీవోలు జారీ చేయగా, అవి ఎన్నికలకు సంబధించి అని చెప్తున్నారు. అయితే మరో 34 జీవోలు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండటంతో, ఇవి ఎందుకో ఎవరికీ అర్ధం కాలేదు. రాష్ట్రంలో రాజధానిని మూడు చేస్తాం అని చెప్పటం, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ అంటూ చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే, ఒకవేళ ఈ 34 జీవోలు, అమరావతికి సంబంధించి ఏమైనా విడుదల చేసారా అనే అభిప్రాయం కలుగుతుంది. ప్రభుత్వం, దీని పై వివరణ ఇస్తే, అప్పుడు ఇవి ఏమిటో తెలిసే అవకాశం ఉంది.