జగిత్యాల జనవరి 21 (way2newstv.com)
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి మంగళవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు .
మండల స్థాయి ముగ్గుల పోటీలు
ఆనంతరం ఈ సందర్భంగా ఎంపీడీవో సంజీవరావు మాట్లాడుతూ మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో జరగబోయే జిల్లా స్థాయి ముగ్గుల పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా మెరుగైన ప్రతిభ కనబరిచి మండలానికి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వెల్గటూర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ బత్తుల భూమయ్య , ఏపీఎం చంద్రకళ, ఏపిఓ శ్రావణ్ కుమార్, ఆర్ఏపిఓ అనిల్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.