ఓటు హక్కుతో మెరుగైన సమాజం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓటు హక్కుతో మెరుగైన సమాజం

కలెక్టర్  కృష్ణ భాస్కర్
సిరిసిల్ల  జనవరి  25  (way2newstv.com)
18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్  కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు . ఓటు హక్కుతో మెరుగైన సమాజం సిద్ధిస్తుందని కలెక్టర్‌  అన్నారు.శనివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో  జాతీయ ఓటరు దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు . రంగు రంగుల బెలూన్ లను గాలిలోకి వదిలారు. జాతీయ ఓటరు దినోత్సవం..  ' బలమైన ప్రజాస్వామ్యానికి ఎన్నికల అక్షరాస్యత ' అనే థీమ్ నేపథ్యంగా నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అథితి గా హాజరై మాట్లడారు.ఓటర్లను జాగృతం చేసేందుకు ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం  వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కోరారు. 
ఓటు హక్కుతో మెరుగైన సమాజం

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అంటే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేయడమే అన్నారు. ఓటరు గా  నమోదవ్వడంతో పాటు  ప్రతి ఓటరూ నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.  ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నదే కార్యక్రమ ఉద్దేశమన్నారు. విద్యార్థులు ,ప్రజలు జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యతను తెలుసుకోవడం తో పాటు దాని ఉద్దేశ్యం ను ప్రజల లోకి తీసుకెల్లలన్నారు . ఓటు వజ్రాయుధం లాంటిదని, దానిని అమ్ముకోవద్దని, తమ జీవితాలను బాగుపరిచే నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటును ఉపయోగించాలని సూచించారు.  ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యత దృష్ట్యా అర్హులందరూ ఓటరుగా నమోదుకు , ఓటు వేసేందుకు స్వచ్ఛదంగా ముందుకు వస్తేనే ప్రజాస్వామ్యం దీర్ఘకాలం పరిడ విల్లుతుందన్నారు.  జిల్లా సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాష మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు జిల్లా ప్రజల అందరి సహకారంతో ఎన్నికలలో ఓటరు నమోదు శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగామన్నారు . ఇందుకు సహకరించిన అధికారులకు, బూత్ లెవెల్  అధికారులకు, గ్రామ రెవెన్యూ అధికారులకు జిల్లా సంయుక్త కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.  క్షేత్రస్థాయిలో అందరిని ఓటరుగా నమోదు చేయడం వల్లే ఓటరు నమోదు శాతం గణనీయంగా పెరిగింది అన్నారు. ఓటరు జాబితాలో అర్హులందరికీ ఓటరుగా నమోదు అయ్యుంటే ఎన్నికలు సజావుగా జరిగి ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుందన్నారు . ఈ నెల 22 న  జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో ఓటింగ్ నమోదు శాతం 81 శాతానికి పైగా నమోదైందన్నారు. రాష్ట్రంలోనే ఇది మంచి నమోదు శాతంగా  నిలిచింది అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు  యొక్క ప్రాధాన్యతను ప్రజలందరికీ నిరంతరం తెలియజేస్తూ దృఢమైన ప్రజాస్వామ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్  విద్యార్థులు, ఉద్యోగులతో కలెక్టర్  కృష్ణ భాస్కర్  ఓటరు  ప్రతిజ్ఞ చేయించారు . జాతీయ ఓటరు దినోత్సవం ను పురస్కరించుకుని మండల , జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన , వక్తృత్వం ,డ్రాయింగ్ పోటీలలో విజేతలైన 39 మంది విద్యార్థులకు కలెక్టర్ ,జేసి  ప్రశంశా పత్రాలు ,జ్ఞాపికలు అందించి అభినందించారు .