ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లింది: పోలవరంపై చంద్రబాబు

అమరావతి అగుష్టు 22   (way2newstv.com
పోలవరంపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతుందని అన్నారు. 
ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లింది: పోలవరంపై చంద్రబాబు

అమరావతిలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లేని అవినీతిని నిరూపించాలని చూశారన్నారు.పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టులో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలన్న నవయుగ సంస్థ పిటిషన్‌పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది.
Previous Post Next Post