తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు

న్యూఢిల్లీ, ఆగస్టు 29, (way2newstv.com)
తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. రైలు  హైదరాబద్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఢిల్లీ సమీపంలోకి చేరుకోగానే రైలులో మంటలు వ్యాపించాయి. పాంట్రీ, ఎస్ 10, బి1  బోగీల్లో మంటలు చెలరేగాయి. అయితే, అధికారులు మాత్రం బ్రేక్ బైండింగ్ లో నిప్పు వచ్చిందని అంటున్నారు. 
తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు

మంటలంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఆగ్నిమాపక వాహానంతో మంటలను అదుపు చేసారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. ఘటనతో రైళ్ల రాకాపోకలకు పాక్షికంగా అంతరాయం కలిగింది. రెండు ఇంజన్లలు తెప్పించి రైలును నడిపించారు.
Previous Post Next Post