మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ సెప్టెంబర్ 21  (way2newstv.com):
 మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీకే తహిల్‌ రమణి రాజీనామాకు ఆమోదం లభించింది. ఈ మేరకు తహిల్‌ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.అదే విధంగా రాజీనామా అంశం సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 
మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా ఆమోదం

జస్టిస్‌ తహిల్‌ రమణిని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతికిసిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో అతి పెద్ద న్యాయ స్థానాల జాబితాలో ఉన్న మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌తో ఉన్నమేఘాలయకు తనను బదిలీ చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. తన బదిలీని పునః సమీక్షించాలని కొలీజియంకు విజ్ఞప్తి చేశారు. అయినా కొలీజియం నుంచి సరైన స్పందనరాకపోవడంతో.. తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించారు.
Previous Post Next Post