4వ రోజు బతుకమ్మ చీరల పంపిణీ_
గద్వాల జోగులాంబ సెప్టెంబర్ 26, (way2newstv.com)
గురువారం కె.టి దొడ్డ మండలంలోని ఉమ్మితాల గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గోన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకు వలే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మహిళాలు లకు బతుకమ్మ , దసరా పండుగ లు కనుకగా చీరలు ఇవ్వడం జరిగింది.
మహిళలకు కెసిఆర్ కానుక
తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు రైతు బీమా, రైతు బంధువు, 24 కరెంటు కళ్యాణంలక్ష్మి, కంటి వెలుగు పథకాలు ,3 సంవత్సరం నుంచి ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా దసరా కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందనిఅన్నారు. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమం లో ఎంపీపీ మనోరమ్మ జెడ్పిటిసి రాజశేఖర్ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు , సర్పంచ్ సత్యనారాయణ , తెరాస పార్టీ నాయకులు ధరూర్ నరసింహా రెడ్డి, శ్రీనివాసరెడ్డి ,ఉరుకుందు చక్రధర్ రాజేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Tags:
telangananews