హైదరాబాద్ సెప్టెంబర్ 20 (way2newstv.com)
కార్పొరేట్ పన్నులను కుదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. కార్పొరేట్ పన్నును తగ్గించడం చరిత్రాత్మకమని, మేక్ ఇన్ఇండియా ప్రోగ్రామ్‌కు ఇది గొప్ప శక్తిని ఇస్తుందని, ప్రపంచ దేశాల నుంచి ప్రైవేటు పెట్టుబడులు పెరుతాయని మోదీ అన్నారు. మన దేశ ప్రైవేటు సెక్టార్‌లోనూ పోటీతత్వం పెరుగుతుందన్నారు.
కార్పొరేట్ పన్నుల కుదింపు పట్ల ప్రధాని మోదీ ప్రశంసలు
130కోట్ల మందికి మరిన్ని ఉద్యోగాలు కల్పించే అవకాశం పెరుగుతుందన్నారు. గత కొన్ని వారాలను గమనిస్తే.. ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాకు ఎంత ఊతమిస్తుందో మీకే అర్థమవుతుందన్నారు. దీనిద్వారా వ్యాపారం మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ చర్యల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్లుగా మారుతుందని మోదీ అన్నారు. కార్పొరేట్ కంపెనీలపై ఆదాయ పన్ను శాతాన్ని30 నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఇవాళ కేంద్ర మంత్రి సీతారామన్ కార్పొరేట్ పన్ను శాతాన్ని తగ్గిస్తూ ప్రకటన చేశారు.
Tags:
telangananews