తెలంగాణలో 19 వరకు స్కూళ్లకు సెలవులు

హైద్రాబాద్, అక్టోబరు 12, (way2newstv.com)
ఈనెల 19(వచ్చే శనివారం) వరకు విద్యా సంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. బస్సు సర్వీసులు పునరుద్ధరించడానికి కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈనెల 19 వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. 
తెలంగాణలో 19 వరకు స్కూళ్లకు సెలవులు

మూడు రోజుల్లో వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వీలైనన్ని ఎక్కువ బస్సులు నడిపేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు
Previous Post Next Post