అయిజ మున్సిపాలిటీలో మెయిన్ డ్రైనేజి కాలువ పనులకు శంకుస్థాపన

గద్వాల జోగులాంబ అక్టోబరు  1 (way2newstv.com)
అయిజ మున్సిపాలిటీ పరిధిలోని అంబేత్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వాగు వరకు గల డ్రైనేజి  మెయిన్ కెనాల్ కు 90 లక్షల వ్యయంతో నిర్మించడానికి ఎమ్మెల్యే  డా.వియం అబ్రహం మంగళవారం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలో నిధులను గతంలో నిధులున్నా పనులు జరగలేదు. 
అయిజ మున్సిపాలిటీలో మెయిన్  డ్రైనేజి కాలువ పనులకు శంకుస్థాపన

కానీ ఎమ్మెల్యే  చొరవతో మున్సిపాలిటిలోని చేపట్టిన పనులు త్వరితాగతిన పూర్థి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజి మున్సిపాలిటీ వైస్ చైర్మన్  నాగన్న గౌడ్, మాజి ఎంపీపీ ప్రకాష్ గౌడ్, జనార్దన్ రెడ్డి , దేవర జయ్యన్న, శేఖర్, మల్లికార్జున రెడ్డి, మహిళా నాయకురాలు రంగు సుమలత, , బాలరాజు, లక్ష్మన్న, సురామంజి,  నరేంద్రవర్మ , మీసాల రవి, మున్సిపాలిటీ ఏఈ గారు తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post