సర్కార్ దూకుడు తగ్గించాలి

తిరుమల నవంబర్ 18  (way2newstv.com)
ప్రభుత్వం దూకుడు తగ్గించి ప్రజలకు అవసరమైన రీతిలో పరిపాలన సాగించాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. సోమవారం తిరుమల వెంకన్నను టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 సర్కార్ దూకుడు తగ్గించాలి

దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రతి పార్టీ నాయకుడు ప్రజల్లో హుందాగా వ్యవహరించాలని కోరారు. దళితులకు, పేదలకు సుపరిపాలన అందించేలా ప్రభుత్వం కృషి చెయ్యాలని కోరారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని మేలుకొలుపుతూ దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను, ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటానని చెప్పారు.
Previous Post Next Post