హైద్రాబాద్, నవంబర్ 15, (way2newstv.com)
నగరంలోని నిజాం కళాశాల ఆవరణలో నిర్వహించిన బయోటెక్నాలజీ జాతీయ సదస్సును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రారంభించారు. బయోటెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి - భవిష్యత్ అవకాశాలపై నిర్వహించిన సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.ఈ సందర్భంగా తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. విద్యార్థుల పరిశోధనలు కొనసాగాలి. ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలి.
పరిశోధనలతోనే మంచి ఫలితాలు
తనకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలోనే పెళ్లి అయిందని గవర్నర్ తెలిపారు. అయినప్పటికీ తన చదువును కొనసాగించాను. పెళ్లి అయిన తర్వాత కూడా ప్రతి అమ్మాయి తప్పకుండా చదవాలి. రోజురోజుకూ జీవసాంకేతిక రంగంలో మార్పులు వస్తున్నాయి. హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉంది. అంతేకాదు.. హైదరాబాద్ లో మెడికల్ సైన్సెస్, ఫార్మసీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సరికొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి అని గవర్నర్ సూచించారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు గవర్నర్ తమిళిసై.
Tags:
telangananews