ముంబై, నవంబర్ 5, (way2newstv.com)
శీ స్టాక్ మార్కెట్ ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్ షేర్లు క్షీణించడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది.ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కల్లా నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ వారం రోజులుగా పెరుగుతూ రావడంతో ఇన్వెస్టర్లు కూడా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. దీంతో సూచీలు నష్టల్లోనే క్లోజయ్యాయి. సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 40,248 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11,917 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
నష్టాల్లో మార్కెట్లు
✺ నిఫ్టీ 50లో బజాజ్ ఫైనాన్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంక్, యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ 3 శాతానికి పైగా పెరిగింది.
✺ అదేసమయంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ దాదాపు 4 శాతం పడిపోయింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మినహా ఇతర ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.95 శాతం పెరుగుదలతో 62.73 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.73 శాతం పెరుగుదలతో 56.95 డాలర్లకు ఎగసింది.
Tags:
Business