అదుపు తప్పిన బస్సు.. ఒకరి మృతి

ఏలూరు నవంబర్ 13(way2newstv.com)
పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. మృతుడిని ఖండవల్లి గ్రామానికి చెందిన రైతుగా గుర్తించారు. 
అదుపు తప్పిన బస్సు.. ఒకరి మృతి

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ద్విచక్రవాహనాన్ని ఢీకొని, అదుపు తప్పి రహదారి పక్కనున్న కరెంటుస్తంభాన్ని ఢీకొని పక్కకి పడిపోయింది. బస్సులో చిక్కుకున్న వారిని పోలీసులు స్థానికుల సాయంతో అత్యవసర ద్వారాల ద్వారా బయటికి తీశారు. ఈ ప్రమాదంతో జాతీయరహదారిపై రెండువైపులా పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్ల సహాయంతో బస్సును తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
Previous Post Next Post