హైదరాబాద్ డిసెంబర్ 5 (way2newstv.com)
పబ్లిక్ అకౌంటు కమిటీ ఛైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందనలు తెలియజేసారు. గురువారం శాసనసభ కమిటీ హాలులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రారంభ సమావేశంలో అయన పాల్గోన్నారు.
అక్బరుద్దిన్ ను అభినందించిన మండలి చైర్మన్
పబ్లిక్ అకౌంటు కమిటీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ కమిటీ ప్రభుత్వ లెక్కల నిర్వహణ మరియు వివిధ పద్దుల క్రింద కేటాయించిన మొత్తాలు ఆయా ఉద్దేశాలకై ఖర్చు చేయబడుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుందని అన్నారు. అదేవిధంగా ఆయా సంస్థలకు, శాఖలకు తగిన సూచనలు చేస్తూ కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేసారు.
Tags:
telangananews