కార్పొరేషన్ ఎన్నికల్లో... బీజేపీ గెలుపు ఖాయం

సర్వే ఫలితాలు బీజేపీకి అనుకూలం
- పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి
- కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచన
- బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు పెద్దపల్లి జితేందర్
పెద్దపల్లి జనవరి 13 (way2newstv.com)
బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి... మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రేణులకు సూచించారు. సర్వేల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.  కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గం మాజీ ఉపాధ్యక్షుడు పెద్దపల్లి జితేందర్... ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. 
కార్పొరేషన్ ఎన్నికల్లో... బీజేపీ గెలుపు ఖాయం

ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ... బీజేపీలో కష్టపడే కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. బీజేపీ బలోపేతం కోసం..  తనవంతుగా అంకితభావంతో పని చేస్తానని పెద్దపల్లి జితేందర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై... బీజేపీలో చేరినట్టు చెప్పారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం...  దేశానికి చాలా అవసరమని అన్నారు. చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ  విధానాలకు ఆకర్షితులై... బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగర వేయడంలో తన వంతు కృషిని చేస్తానని తెలిపారు.  పెద్దపల్లి జితేందర్ తో పాటు  55వ డివిజన్ కు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.
Previous Post Next Post