పోలవరానికి తొలగిన అడ్డంకులు

న్యూఢిల్లీ, జూలై 10 (way2newstv.com) 
పోలవరం స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై స్టేను మరె ఏడాది పాటు పొడిగించారు. దీంతో ప్రాజెక్టు పనులు పరుగెత్తుతున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సంయుక్త, అదనపు కార్యదర్శులతో పాటు. అటవీ శాఖ అధికారులు ఫైలుకు  ఆమోదముద్ర వేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా కొనసాగనున్నాయి. మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం పనులు  గాడిలో పెట్టింది.  నాలుగు రోజుల నుంచి స్టాప్ వర్క్ టెన్షన్ తొలగిపోయింది. 
 
 
 
పోలవరానికి తొలగిన అడ్డంకులు 
 
ఒడిసా, ఛత్తీస్ గఢ్‌ ముందు నుంచీ  అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో... ఏపీలో ఆందోళన  మరింత తీవ్రమైంది.. 2015లో నిర్మాణ పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌..ఎన్‌జీటీ.. స్టాప్‌ వర్క్‌ ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ఈ ఆదేశాలపై 2016లో స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో.. 2017 జూలై 2వరకూ ప్రాజెక్ట్ పనులు కొనసాగించే అవకాశం కలిగింది. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. కేంద్రమంత్రి జవదేకర్ సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగింది. అయితే.. ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జవదేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు.చాలారోజుల క్రితమే స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. స్టే ఎందుకు కొనసాగించాలో స్పష్టం చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు లేఖ కూడా రాసింది. మరో వైపు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన రెండ్రోజులకే ఒడిసా సీఎం లేఖ రాశారు. తమ అభ్యంతరాలను అందులో పేర్కొన్నారు. ఆయన చెప్పిన కారణాలు సహేతుకంగా లేవంటూ ఆంధ్ర జలవనరుల కార్యదర్శి కేంద్ర పర్యావరణ అటవీశాఖకు వివరిస్తూ మరో లేఖ రాశారు. స్టే పొడిగింపుపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి ఝా సానుకూలంగా ఉన్నా.. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టెన్షన్  ఉన్నప్పటికి...  కేంద్రం స్టాప్‌ ఆర్డర్‌ పై మరో ఏడాది స్టే ఇచ్చింది.
Previous Post Next Post