ఏపీని రెండో రాజధానిగా చూసుకోండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీని రెండో రాజధానిగా చూసుకోండి

సింగపూర్, జూలై 10 (way2newstv.com)
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్‌లో బిజీబిజీగా ఉన్నారు. సోమవారం ప్రఖ్యాత లీ క్వాన్ యూ యూనివర్సిటీలో పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2022 కల్లా ఏపీని దేశంలో మూడు అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో నెంబర్ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. ప్రజల సంతృప్తి, సంతోషమే పరమావధిగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నానని సీఎం చెప్పుకొచ్చారు. వ్యాపార సానుకూలత అంశాలలో ప్రథమస్థానంలో ఉన్నామన్నారు.సింగపూర్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొన్న సీఎం.. కీలక ప్రసంగం చేశారు. ‘నీరు, పర్యావరణానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవాలంటే సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం. వనరుల నిర్వహణలో వైజ్ఞానిక, సమాచార సాంకేతికత ఫాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అమరావతిలో అన్ని ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని వినియోగించుకుంటున్నాం. 
 
 
 
ఏపీని రెండో రాజధానిగా చూసుకోండి
 
రాష్ట్రంలో సరికొత్త నిర్వహణ పద్ధతుల్లో భూగర్భజలాలను పెంచగలుగుతున్నాం. నదుల అనుసంధానం, భూగర్భ జలాలు, వ్యర్థ నీటిని నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించాం. రైతుల భాగస్వామ్యంతో జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నామన్నారు’సీఎం. ఈ ప్రపంచ నగరాల సదస్సులో చంద్రబాబుతో పాటూ శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే, సింగపూర్ ఉప ప్రధాని థర్మన్ షణ్ముగరత్నంలు పాల్గొన్నారు. వారు కూడా పలు కీలక ప్రసంగాలు చేశారు. అంతకముందు సీఎం బృందం సింగపూర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించింది. స్మార్ట్ అర్బన్ హ్యాబిటేట్‌పై ప్రధానంగా పరిశీలించారు. తక్కువ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి విధానాలన్నింటిని అనుసరించి.. రాష్ట్రంలో కూడా ఇళ్లి నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలక్రికల్ కార్లదే హవా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సౌరశక్తి అంశంలో భారత్ మరింత అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఖర్చుతో కూడుకున్నదే అయినా సోలార్ విండ్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సింగపూర్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు ఆ దేశ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సింగపూర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. స్మార్ట్ అర్బన్ హాబిటేట్ అంశంపై పలువురు నేతలు, ప్రతినిధులు మాట్లాడారు. ఈ డిబేట్‌లో పాల్గొన్న చంద్రబాబు గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తూ ఏపీ నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు. కొత్త సిటీలో 35 లక్షల మంది నివసించే ఆస్కారం ఉందన్నారు.అమరావతిలో నిర్మించనున్న సిటీలు, టౌన్‌ సిటీలు, రింగ్‌రోడ్డు గురించి సింగపూర్ ప్రతినిధులకు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్‌లు, సోషల్ యాక్సిస్, వర్క్‌ టు వర్క్ ప్రిన్సిపల్‌తో అమరావతిని గార్డెన్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు.మరోవైపు సింగపూర్ టూర్‌‌లో పెట్టుబడులపై కూడా సీఎం ఫోకస్ పెట్టారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంతో పాటూ అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానం పలికారు.