కేసీఆర్ ను ఎదుర్కొవడం కాదు… ఓడిస్తాం : జైపాల్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ ను ఎదుర్కొవడం కాదు… ఓడిస్తాం : జైపాల్ రెడ్డి

హైదరాబాద్, ఆగష్టు 28 (way2newstv.com)  
ఒక్క ఇందిరాగాంధీ తప్ప  ముందస్తు కు వెళ్లిన వారంతా ఓడిపోయారు. గతంలో ఇండియా షైనింగ్ అంటూ వెళ్లిన వాజ్ పేయికి కూడా ఇదే గతి పట్టింది. ఇప్పుడు తెలంగాణ లోను కేసీర్ కి ఓటమి తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ముందస్తు వస్తుందంటే కాంగ్రెస్ సంతోషపడుతోంది.  ముందస్తుకు వెళ్లినా ముందస్తు ఓటమి తప్పదు. కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వెళ్ళినప్పుడు సింహం లా దూకుతుంది. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందనే కెసీర్ ముందస్తుకు వెళ్తున్నారు. మోడీ తో మిత్రత్వం దాచిపెట్టేందుకు కెసీర్ ప్రయత్నిస్తున్నారని అయన అన్నారు. కాంగ్రెస్ జాతీయపార్టీ.  కొంతమంది అసంతృప్తివాదులు ఉంటారు . కానీ యుద్ధంలోకి దిగేటప్పుడు అందరూ ఒక్కటే. మిషన్ భగీరథలో ఎవరికి నీరు రాలేదు. కేవలం కాంట్రాక్ట్స్ కు నిధులు వచ్చాయి. ఎవరు ప్రచారం నిర్వహించాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది. రాహుల్ సభలు బ్రహ్మాండంగా విజయవంతం అయ్యాయని అయన అన్నారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ అని ఇప్పుడు తెలంగాణ మారుమూల ప్రాంతాలకు కూడా తెల్సింది.  కెసీర్ హామీలను విస్మరించారు. మాట నిలబెట్టుకోలేదు. కేసీర్కు  ఓటమి తప్పదని అయన అన్నారు.
 
 
 
కేసీఆర్ ను  ఎదుర్కొవడం కాదు… ఓడిస్తాం :   జైపాల్ రెడ్డి