గెలిచే అవకాశాలు, సామాజిక సమీకరణాలను బట్టే టికెట్లు కేటాయింపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గెలిచే అవకాశాలు, సామాజిక సమీకరణాలను బట్టే టికెట్లు కేటాయింపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ ఆగష్టు 29 (way2newstv.com)
తెలంగాణలో వందకు వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 70 శాతానికిపైగా సీట్లు గెలవబోతున్నామన్నారు. పొత్తులపై సీనియర్లతో చర్చించామని, సెప్టెంబర్‌లో అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేస్తామని చెప్పారు. గెలిచే అవకాశాలు, సామాజిక సమీకరణాలను బట్టే టికెట్లు కేటాయింపు ఉంటుందన్నారు. మంగళవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ మోసం చేశారన్నారు. దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్నారు. భూకంపం పుట్టిస్తానన్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ సిద్ధమయ్యారన్నారు. అబద్ధాలు చెప్పడం, భవనాలకు శంకుస్థాపన చేయడం కేసీఆర్‌కు అలవాటే అన్నారు. కొత్తగా ఆత్మగౌరవ భవనాలంటూ కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
 
 
 
గెలిచే అవకాశాలు, సామాజిక సమీకరణాలను బట్టే టికెట్లు కేటాయింపు
            టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి