రైతు సమన్వయ సమితి ప్రారంభించిన మంత్రి పోచారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతు సమన్వయ సమితి ప్రారంభించిన మంత్రి పోచారం

హైదరాబాద్,  ఆగస్టు 29, (way2newstv.com)
 జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో   "తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి" కార్యాలయాన్ని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  పొచారం శ్రీనివాస రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి,  వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్ధసారధి,  వ్యవసాయ శాఖ కమిషనర్ యం జగన్మోహన్,  ఉద్యానశాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వినర్లు ఇతరులు పాల్గోన్నారు. మంత్రి  పొచారం మాట్లాడుతూ అద్భుతమైన పనితీరుతో తెలంగాణ వ్యవసాయ శాఖకు దేశంలోనే మంచి గుర్తింపు వచ్చింది.  రైతు సమన్వయ సమితిలో అంతా రైతు కుటుంబాలకు చెందిన, రైతుల కష్టాలు తెలిసిన వారే ఉన్నారు.  
 
 
 
రైతు సమన్వయ సమితి ప్రారంభించిన మంత్రి పోచారం
 
వ్యవసాయ రంగం అభివృద్దే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్యేయం, లక్ష్యమని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో పంటల ఉత్పత్తి 50 మిలియన్ టన్నులు ఉండగా నేడు 300 మిలియన్ టన్నుల కు పెరిగింది.  ఉత్పత్తి పెరిగింది కాని సగటు ఉత్పాదకత అనుకున్నంత స్థాయిలో పెరగలేదు.  ఉత్పాదకత పెరిగితేనే రైతులకు లాభం. ఉత్పాదకత పెంపుపై అందరు దృష్టి పెట్టాలి.  రైతు సమన్వయ సమితి ప్రభుత్వంలో బాగస్వామి. ప్రభుత్వం తరుపున అన్ని విదాలుగా సహకారం అందిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్ణయాలపై దేశవ్యాప్తంగా  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా24 గంటల కరంటు ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ. పంట పెట్టుబడిగా ప్రతి ఎకరాకు రూ. 8000 ను గ్రాంట్ గా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలో రైతుల కోసం ఇంత బారీ ఎత్తున జీవిత బీమాను అమలుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది రైతులకు బీమా రక్షణ కల్పించాం.  ఇప్పటి వరకు చనిపోయిన రైతుల సంఖ్య 417 అయితే, 306 మంది రైతుల కుటుంబ సభ్యుల నామినీ బ్యాంకు ఖాతాలలోకి రూ. 5 లక్షలను ట్రాన్స్ ఫర్ అయినాయి.  పేద రైతు కుటుంబానికి రూ. 5 లక్షల సహాయం అందడం నిజంగా పెద్ద ఊరట. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో వ్యవసాయ రంగం కార్యకలాపాలు పెరుగుతాయని అన్నారు. దేశంలో అన్ని రకాల పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ.  భవిష్యత్తులో పంట ఉత్పత్తులను రైతు సమన్వయ సమితులే కొనుగోలు చేస్తాయి. జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కు వాహన సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.