కొండపల్లి ఖిల్లాలో లేజర్ షో

విజయవాడ, పిబ్రవరి 14, (way2newstv.com)
విజయవాడకు సమీపంలోని కొండపల్లి ఖిల్లాను సేవారంగ అభివృద్ధికి వేదికగా మలచుకోవాలని భావిస్తు న్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో మాదిరిగానే ఇక్కడ కూడా లేజర్‌ షో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. లైట్‌ అండ్‌ సౌండ్‌ షోలను ఏర్పాటుచేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చునని అధికారులు అంటున్నారు. ఇదే తరహాలో విజయవాడలోని బాపూ మ్యూజియంలో కూడా లైట్‌ అండ్‌ సౌండ్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆయుర్వేద రంగాన్ని పర్యాటక అభివృద్ధిలో వినియోగించుకోవాలని నిర్ణయిరచారు. 

 
కొండపల్లి ఖిల్లాలో లేజర్ షో

ఈ రంగంలో కేరళ ఎరతో మురదంజలో ఉరది. దేశ విదేశాల నురచి కేరళకు వైద్యం కోసం లక్షలాది మంది తరలివస్తురటారు. అరదుకే రాష్టంలో కూడా కేరళ తరహాలోనే ఆయుర్వేద రిసార్టులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వీటితో విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చునని అరచనా వేస్తున్నారు. ఇది సేవారంగ వృద్ధికి ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు అరటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతితోపాటు మరో కొత్త ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం స్టూడియోలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఇక తాడిపూడి, పోలవరం రిజర్వాయర్లలో హౌస్‌ బోట్లుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.రాజస్థాన్‌లో ప్రాముఖ్యత కలిగిన ధోలా- రి-ధని తరహాలోనే విజయవాడ నగరానికి సమీపంలో రిసార్టులను ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు.వీటిల్లో ఫుడ్‌ పార్క్‌లు, ఆట ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, జల క్రీడలు వంటివి ఉరటాయి. వీటితోపాటు ఫుడ్‌ కోర్టులను కూడా విజయవాడకు సమీపంలోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇవి కూడా పర్యాటకులను ఆకర్షించేందుకు సహాయపడతా యని అంటున్నారు. కాగా, ఇటువంటి పర్యాటక విభాగాలను మరిరతగా ఆకర్షించేందుకు వాణిజ్య పన్నుల వసూళ్లు, రిజిస్ట్రేషన్లు కూడా సరళీకృతం చేయాలని యోచిస్తున్నారు.
Previous Post Next Post