విజయనగరంలో సీటు కోసం ఫైట్… - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయనగరంలో సీటు కోసం ఫైట్…

విజయనగరం, ఫిబ్రవరి 13, (way2newstv.com
విజయనగరం జిల్లా రాజకీయాల్లో రాజ వంశస్తులకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో విజయనగరం రాజులు, బొబ్బిలి, కురుపాం రాజులు ఇలా అంతా వందల ఏళ్ళ నుంచి సంస్థానాలను పాలిస్తూ మహారాజులుగా చలామణీ అయ్యారు. అయితే ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న వేళ రాజులు సైతం ఓటు కోసం జనంలోకి రావాల్సి వచ్చింది. ఈ జిల్లాలో పూసపాటి వారికి, బొబ్బిలి రాజులకు కూడా శతాబ్దాల వైరం ఉంది. బొబ్బిలి యుధ్ధం కూడా వీరి పూర్వీకుల మధ్యన జరిగింది అందువల్ల కాంగ్రెస్ లో బొబ్బిలి రాజులు ఉంటే టీడీపీలో పూసపాటి వారసులు వుంటూ వచ్చారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బొబ్బిలి రాజులు కూడా సైకిలెక్కేశారు. 

 
విజయనగరంలో సీటు కోసం ఫైట్…

మంత్రి కావాలన్న కోరికను ఆ విధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు నేరవేర్చుకున్నారు.ఇదిలా ఉండగా బొబ్బిలి రాజుల మధ్యన సీటు కోసం ఇపుడు చిన్న పాటి యుధ్ధమే నడుస్తోందని టాక్. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన సుజయ కృష్ణ రంగారావు మరో మారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆయన తమ్ముడు బేబీ నాయన కూడా బొబ్బిలి ఎమ్మెల్యే సీటుని ఆశిస్తున్నారు. దీంతో ఈ అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు వచ్చాయని అంటున్నారు. గతంలో అంటే 2014 ఎన్నికల్లో బేబీ నాయన వైసీపీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన రంగారావు గెలిచి పార్టీ ఫిరాయించారు. ఇపుడు అన్నదమ్ములు ఇద్దరూ టీడీపీలోనే ఉన్నా సీటు మాత్రం ఒక్కటి కావడంతో పోటీ పెరిగింది. ఈ తగవు ఏకంగా టీడీపీ హై కమాండ్ దాకా వెళ్ళిందని టాక్. బేబీ నాయన యువ నేత, మంత్రి లోకేష్ ని కలసి మరీ… తనకు టికెట్ కావాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. టైంలో మంత్రిగా రంగారావు పనితీరు పట్ల టీడీపీ హై కమాండ్ అంత సంతృప్తిగా లేదన్న మాట వినిపిస్తోంది. టీడీపీకి చెందిన కిమిడి మృణాళినిని పక్కన పెట్టి మరీ ఫిరాయింపు ఎమ్మెల్యేకు మంత్రి పదవిని బాబు కట్టబెట్టారు. అయితే జిల్లాలో పార్టీకి ఒక తాటిపైకి తీసుకురాలేకపోవడం తో పాటు మంత్రిగా కూడా రంగారావు ప్రతిభావంతంగా తనను తాను నిరూపించు కోలేకపోయారని అంటున్నారు. దాంతో బాబు ఆయన్ని విజయనగరం ఎంపీ సీటు ఇచ్చి డిల్లీకి పంపుతారని టాక్ నడుస్తోంది. అదే సమయంలో బేబీ నాయనకు బొబ్బిలి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయించాలనుకుంటోందంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేపై జనానికి ఉన్న కోపం తగ్గుతుందని, కొత్త అభ్యర్ధిగా కూడా బేబీ నాయనని ఫోక‌స్ చేయవచ్చునని వ్యూహంగా చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని అశోక్ కి కట్టబెట్టాలన్న ముందు చూపుతోనే రంగా రావుని డిల్లీకి పంపుతున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో అన్నదమ్ముల మధ్య బొబ్బిలి సీటు యుధ్ధమే చేయిస్తోందని అంటున్నారు. రంగారావుకు ఎంపీకి పోటీ చేయడం ఇష్టం లేదని కూడా అంటున్నారు. కాగా దీనిపై బేబీ నాయన మాట్లాడుతూ, అన్నదమ్ముల మధ్య విభేదాలు లేవని, పార్టీ హై కమాండ్ ఎలా చెబితే అలా నడచుకుంటామని చెప్పడం విశేషం.