తుగ్గలి, మార్చి 2 (way2newstv.com)
కస్తూరిబా ఇంటర్మీడియట్ కళాశాల భవన నిర్మాణానికి అధికారులు భూమి పూజను నిర్వహించారు.మండల కేంద్రమైన తుగ్గలిలో కస్తూరిబా పాఠశాల ఆవరణంలో 8 భవనాల తో కూడిన ఇంటర్మీడియట్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
కస్తూరిబా కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ
కోటి పది లక్షల వ్యయంతో 8 భవనాలను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు మాట్లాడుతూ కోటి పది లక్షల రూపాయలతో కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు,వీలైనంత త్వరగా కళాశాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిఈఈ లక్ష్మణస్వామి,ఏఈ మురళి, పాఠశాల ప్రత్యేక అధికారి అభిదా బేగం,స్థల ధాత విజయభాస్కర్ మరియు కస్తూరిబా ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
telangananews