మోహన్‌బాబువి అసత్య ఆరోపణలు

ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
అమరావతి మార్చ్ 22 (way2newstv.com
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సినీ నటుడు మోహన్‌బాబు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ మోహన్‌బాబు నిరసనకు దిగడంపై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 


మోహన్‌బాబువి అసత్య ఆరోపణలు

ప్రతిపక్షానికి ఆయన వంతపాడుతున్నారని కుటుంబరావు ఆరోపించారు. కక్ష పూరితంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర  ప్రయోజనాలపై ఆయన ఏ రోజైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
Previous Post Next Post