కుంటలో పడి ఇద్దరి మృతి

 కామారెడ్డి  మార్చి 1(way2newstv.com)
 కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి డివిజన్లో గల హాజీపూర్ తండా శివారులో నిన్న సాయంత్రం కుంటలో పడి ఓ వృద్ధురాలు , బాలుడు మృతి చెందారు. మృతులు సభావాత్ బులిబాయి (60), సభావాత్ సవాయి సింగ్ (12) గా పోలీసులు గుర్తించారు. పశువులకు నీళ్లు తాగించడానికి కుంట వద్దకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు. 


కుంటలో పడి ఇద్దరి మృతి      

తొలుత బాలుడు పడిపోగా మనుమడిని కాపాడబోయి నానమ్మ కూడా మృతి చెందినట్లు తెలిపారు.    మృతుల అంత్యక్రియల్లో ఎల్లారెడ్డి శాసనసభ్యుడు జాజాల సురేందర్  పాల్గొన్నారు. మృతుల కుటుంబానికి ఆదుకుంటానని అన్నారు. మృతుల అంత్యక్రియలకు 10 , 000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో చిన్న లక్ష్మణ్ , మాజీ జడ్పీటిసి గాయాజుద్దీన్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post