అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భరోసా పథకం అమలు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ మార్చ్ 25 (way2newstv.com)
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) జరిగింది. ఇందులో రాహుల్‌తో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరూ పాల్గొన్నారు. 


అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భరోసా పథకం అమలు: రాహుల్ గాంధీ

ఈ సమావేశం అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘దేశంలోని పేదలకు కనీస ఆదాయ భరోసా పథకం అమలు చేస్తాం. భారత్‌లోని 20 శాతం మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. అంటే ఐదు కోట్ల కుటుంబాల్లోని 25 కోట్ల మంది పేదలు దీని ప్రయోజనాలను పొందవచ్చు. వారి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.72,000 వేస్తాం. దీని కోసం అన్ని గణాంకాలను సరి చూసుకున్నాం. ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదు’ అని తెలిపారు. 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దానిపై తమ పార్టీ చివరి పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.  
Previous Post Next Post