విజయవాడ మార్చి 19 (way2newstv.com)
చంద్రబాబు కు ఎన్నికల్లో గెలవలేమని తెలిసిపోయింది. అధికారులను అడ్డం పెట్టుకుని కోడ్ ఉల్లంఘన కు పాల్పడుతున్నారని మంగళగిరి వైకాపా అభ్యర్ధి అళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణా యువకులతో నియోజకవర్గం లో సర్వే చేయిస్తుంటే భయపడి వారిని ఆరెస్ట్ చేయించారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోనే పరిస్థితి కల్పించాలి. ప్రజలను ప్రలోభ పెట్టందుకు రకరకలా వ్వూహలు పన్నుతున్నారు. నీతికి నిజాయితీకి మంగళగిరి లో ఎన్నికలు జరుగుతున్నాయి. పేదవాడి నోటి దగ్గర ఉన్న కూడూను తీసేందుకు సిద్దమయ్యారని అయన విమర్శించారు. లోకేష్ కాదు మంగళగిరి లో చంద్రబాబు పోటి చేయాలి. చంద్రబాబు అయితే ఓడిపోతే పరువు పోతుందని లోకేష్ గోల పడలేక చంద్రబాబు మంగళగిరి లో పోటి చేయిస్తున్నారని అయన అన్నారు.
తెదేపా కార్యకర్తలుగా పోలీసు అధికారులు
పోలిసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇంటిలిజెన్స్ ఛీప్ ఎబి వెంకటేశ్వరరావు టిడిపి కార్యకర్త లా వ్యవహరిస్తున్నారు. ఇంటిలిజెన్స్ కార్యాలయం ను టిడిపి కార్యాలయం గా మార్చారని ఆరోపించారు. అటంకాలు కలిగించిన న్యాయ పరంగా పోరాడాతా. డిజిపి, ఎబి వెంకటేశ్వరరావులను అయన వార్నింగ్ ఇచ్చారు. మీఊరుకు మాఊరుకు ఒకే దూరం ఉంటుందని గుర్తించాలి. మంగళగిరి ని గుచ్చిభౌలి చేయనవసరం లేదు. లక్ష్మినరసింహస్వామి భూములు కబ్జా చేసేందుకు లోకేష్ మంగళగిరి వచ్చారు. చివరకి పవన్ కల్యాణ్ ను కూడా మేనేజ్ చేసారు. గతంలో మీరు ఒక మహిళకు ఉండవల్లి భూములు విషయంలో హమీ ఇచ్చారు..
భూములు కాపాడతానని చెప్పారు..మరి ఇప్పుడు టిడిపికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని అయన ప్రశ్నించారు.
మంగళగిరిలో పవన్ కల్యాణ్, టిడిపి చంద్రబాబు నేను పోటిలో ఉంటామని బావించా. పవన్ కల్యాణ్, టిడిపి మధ్య జరిగిన ఒప్పందం మేరకే సిపిఐ కి సీటు కేటాయించారు. మంగళగిరి ప్రజల సమస్యలు మీకు తెలుసా.. గత 5సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివశిస్తున్నావ్ ఒక్క సమస్య అయినా పరిష్కరించావా అని లోకేష్ ను ప్రశ్నించారు. మీ అబ్బాయ్ నాకు పోటి కాదు..నాకు సరి జోడి నువ్వు... పోటి చేయమని చంద్రబాబును అడిగారు. డిజిపికి ఆపదవిలో ఉండే ఆర్హత లేదు. హైదరాబాదు లో పార్కులు ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్న డిజిపి ఆపదవికి అనర్హుడని అయన విమర్శించారు.